Top
logo

"ముఖం జాగ్ర‌త్త" టాస్క్‌ పెట్టిన బిగ్ బాస్

ముఖం జాగ్ర‌త్త టాస్క్‌ పెట్టిన బిగ్ బాస్
X
Highlights

Bigg Boss Telugu 4: బిగ్ బాస్ ఇంట్లో 57వ రోజు గ‌రంగ‌రంగా ప్రారంభ‌మైన నామినేష‌న్ ప్ర‌క్రియ 58వ రోజు పీక్స్‌కు చేరింది.

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఇంట్లో 57వ రోజు గ‌రంగ‌రంగా ప్రారంభ‌మైన నామినేష‌న్ ప్ర‌క్రియ 58వ రోజు పీక్స్‌కు చేరింది. అభిజిత్ ఎదుటివాళ్ల మాట వినిపించుకోని మాస్ట‌ర్‌పై త‌న ప్ర‌తాపాన్ని చూపించాడు. అలాగే అఖిల్ త‌ను ఎంతో ఇష్ట‌ప‌డే మోనాల్‌ను నామినేట్ చేశాడు. ఇలాంటి ఆసక్తికరమైనవి బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ఏమేం జరిగాయో చూసేద్దాం.

బిగ్ బాస్ ఇంట్లో 57వ రోజు అవినాష్‌ను నామినేట్ చేసిన అభిజిత్ 58వ రోజు అమ్మ రాజ‌శేఖ‌ర్‌పై కోడిగుడ్డు ప‌గ‌ల‌గొట్టాడు. దీంతో అస‌హ‌నంతో ఊగిపోయిన మాస్ట‌ర్‌ అభికి మాట్లాడే చాన్సివ్వ‌కుండా అర్థం ప‌ర్థం లేని మాట‌ల‌న్నీ అనేశాడు. తర్వాత హారిక కూడా రీజన్ చెప్తూ మాస్టర్ ని నామినేట్ చేసింది. ఇక లాస్య అవినాష్, మోనాల్ లను టార్గెట్ చేస్తూ నామినేట్ చేసింది. అలాగే మోనాల్ సోహైల్, లాస్యను నామినేట్ చేయగా, మోనాల్ బదులు అవినాష్ గుడ్డును కొట్టాడు. అభిజీత్, అఖిల్ ను టార్గెట్ చేస్తూ మాస్టర్ గుడ్డు కొట్టి నామినేట్ చేసాడు. అఖిల్ తో సరైన కారణాలు చెప్పలేక చిన్నపిల్లాడిలా మాట్లాడినట్లు అనిపిస్తుంది.

మహబూబ్ హారిక తలపై గుడ్డును కొట్టి రీజన్ చెబుతూ నామినేట్ చేసాడు. గేమ్ ప్రారంభంలో హై పిచ్ లో ఉండి రానురాను నెమ్మది పడిపోతావు. అలా కాకుండా ఎల్లప్పుడు ఒకే పంథాను కొనసాగించమని చెప్పాడు. అలాగే అవినాష్ ను కూడా టార్గెట్ చేస్తూ నోమినేట్ చేసాడు. మాస్ట‌ర్ మీద గుడ్డు ప‌గ‌ల‌గొట్టి నామినేట్ చేసిన అఖిల్, లాస్ట్ టాస్క్‌లో ప‌ర్ఫామ్ చేయ‌లేదు, నీకు క్లారిటీ లేదు అనిపించింది అని మోనాల్‌ను నామినేట్ చేశాడు. ఊహించ‌ని ప‌రిణామానికి షాక్ అయిన మోనాల్ శిలా విగ్ర‌హంలా నిల్చుండిపోయింది.

అఖిల్ ఇచ్చిన ట్విస్టు నుంచి తేరుకోని మోనాల్ ఆవేద‌న‌లో ఏదేదో మాట్లాడేసింది. మ‌నుషుల‌ను త‌ప్పుగా అంచ‌నా వేశాన‌ని బాధ‌ప‌డింది. తాను ఒంట‌రినంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. ఇంత జ‌రిగినా మోనాల్ కు అఖిల్ మీద ఇసుమంత ప్రేమ త‌గ్గ‌లేదు. రాత్రి ఒళ్లు మ‌రిచి నిద్ర‌పోతున్న‌ అఖిల్‌కు చ‌లి పెట్ట‌కుండా దుప్ప‌టి క‌ప్పింది. మొత్తంగా మోనాల్‌, అభిజిత్‌, హారిక‌, అవినాష్‌, అమ్మ రాజశేఖ‌ర్ నామినేష‌న్‌లో నిలిచారు. వీరిలో ఒక‌రు ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యేందుకు బిగ్‌బాస్‌ "ముఖం జాగ్ర‌త్త" అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా నామినేట్ అయిన వాళ్లు టీ స్టాండ్ మీద ముఖం పెట్టాలి. ఎండ్ బ‌జ‌ర్‌కు ఎవ‌రి త‌ల స్టాండ్ మీద ఉంటే వారు నామినేష‌న్ నుంచి సేఫ్ ఐనట్లు.

ఇక టాస్క్‌లో భాగంగా మిగ‌తా ఇంటిస‌భ్యులు నామినేట్ అయిన‌వాళ్ల‌ను ఐస్ గ‌డ్డ‌లు, నీళ్లు, గ‌డ్డి, మ‌ట్టి ఉప‌యోగిస్తూ నానార‌కాలుగా హింసించారు. అంద‌రి క‌న్నా కాస్తంత ఎక్కువ‌గా మోనాల్‌ను హింసించిన‌ట్లు క‌నిపించింది. అది చూసి త‌ట్టుకోలేక‌పోయిన అఖిల్.. మోనాల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆమె ముఖం శుభ్రం చేశాడు. దీంతో మెహ‌బూబ్‌ మాస్ట‌ర్‌కు సాయం చేస్తే ఎందుకు వ్య‌తిరేకించావ‌ని సోహైల్ అఖిల్ మీద‌ అరిచాడు. ఒక స్టేజ్ లో అఖిల్ కొట్టుకునే వరకు వచ్చారు. ఇంత‌వ‌ర‌కు ప‌డ్డ క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయ్యింద‌ని అవినాష్ బాధ‌ప‌డ్డాడు. ఎన్నో అవ‌మానాలు ప‌డి వ‌చ్చానని, మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ లోకి తీసుకోమ‌ని చెప్పారని, అవ‌న్నీ గుర్తొచ్చాయ‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఒకరు కన్నా ఎక్కువ మంది ఉన్నందున ఎవరికీ ఇమ్యూనిటీ లభించలేదు. మ‌రోవైపు అఖిల్ చేసిన మోసానికి మోనాల్ కుంగిపోయింది. తనను అఖిల్ నమ్మనందుకు బాధపడుతూ ఒంటరిగా కన్నీళ్లను జారవిడిచింది.

Web TitleNagarjuna Bigg Boss Telugu season 4 November 3 Episode 59 highlights for no immunity nominated members
Next Story