80వ రోజు హౌస్‌లో ప్రవేశించిన దెయ్యం.. మోనాల్‌తో డేట్‌కు వెళ్లిన అఖిల్

80వ రోజు హౌస్‌లో ప్రవేశించిన దెయ్యం.. మోనాల్‌తో డేట్‌కు వెళ్లిన అఖిల్
x
Highlights

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ మొత్తం బోల్డ్ బ్యూటీ మోనాల్ చుట్టే నడుస్తోంది. కాదు.. కాదు.. మోనాల్ చుట్టూ నడచేలా చేస్తున్నాడు బిగ్‌బాస్.. ఆమె చుట్టూ...

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ మొత్తం బోల్డ్ బ్యూటీ మోనాల్ చుట్టే నడుస్తోంది. కాదు.. కాదు.. మోనాల్ చుట్టూ నడచేలా చేస్తున్నాడు బిగ్‌బాస్.. ఆమె చుట్టూ ఎపిసోడ్స్ నడుస్తు్న్నాయి. బిగ్‌బాస్ మొదట్లో ప్రతిదానికి ఏడ్చి ప్రేక్షకులకు బోర్‌ కొట్టించిన మోనాల్ తర్వాత ఫామ్‌లోకి వచ్చింది. ఆమె కోసమే చాలా మందిని బయటకు పంపించినట్టు టాక్ అఖిల్, అభిజిత్ ట్రయాంగిల్‌ స్టోరీ కాస్తా చివరకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. మరి హౌస్‌లో 80వరోజు జరిగిన హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బిగ్‌బాస్ చివరి దశకు చేరుకోవడంతో ఆసక్తిగా మారింది. గేమ్‌ షో‌ ను ఆసక్తిగా మార్చేందుకు భిన్నమైన టాస్క్‌లు ఇస్తున్నారు. కొత్త కొత్త గేమ్‌లు, కొత్త తరహా టాస్క్‌లను ప్రవేశపెట్టి మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. కంటెస్టెంట్‌ల మధ్య ఫిటింగ్ పెట్టేందుకు బిగ్‌బాస్ నేరుగా రంగంలోకి దిగాడు. 80వ రోజు ఉదయం గబ్బర్ సింగ్‌ పాటతో హౌస్ మెంబర్స్ నిద్ర లేచారు. ఆ తర్వాత సోహైల్ టూత్ పేస్ట్‌తో ముఖం కడుక్కునే ప్రయత్నం చేశాడు కానీ, ముఖం మండడంతో వెంటనే కడుక్కున్నాడు.

అరియాణా, అఖిల్ మాట్లాడుకుంటుండగా మోనాల్ జ్యూస్ తీసుకొచ్చింది. ఆ సమయంలో అఖిల్ అరియాణాతో క్లోజ్‌గా ఉండడం తట్టుకోలేక అలిగి ఇంట్లోకి వెళ్లింది. దీంతో మోనాల్ భారం తగ్గిందని అఖిల్ నవ్వాడు. అరియాణా అవినాష్ కలిసి సరదాగా కొట్టుకున్నారు. అవినాష్ మీద అఖిల్ చేయి వేయడంతో సోహైల్ రంగంలోకి దిగాడు ముగ్గురి మధ్య కాసేపు సరదాగా గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. నిజంగానే కొట్టుకున్నారా అనిపించేలా గొడవ పడ్డారు. చివరకు అందరూ కలిసి పోయారు.

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌ ఎండింగ్‌‌కు వచ్చింది. ఇంకా కేవలం 25 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దాంతో గేమ్‌ను ఇంకా బాగా రసవత్తరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కొత్త కొత్త టాస్క్‌లను ప్రవేశపెడుతున్నారు. బుధవారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓ అతిథిని పంపి అందరిని భయపెట్టే ప్రయత్నం చేశారు.

బిగ్‌బాస్ ఎండింగ్ లో జనాలను ఆకర్షించేందుకు కొత్తగా ఆలోచిస్తున్నారు. బుధవారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌లోకి ఒక అతిథిని పంపి అందరిని భయపెట్టే ప్రయత్నం చేశారు బిగ్‌బాస్. గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని కొత్త తరహా సెట్స్‌ని వేశారు. ఇంట్లోకి దెయ్యాన్ని పంపి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే హౌస్‌మెంట్స్‌ని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇందులో మొదటగా భయపడింది అరియాణా.

దెయ్యాన్ని చూసి భయపడిన అరియాణాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. దెయ్యానికి భయపడేది లేదంటూ సోహైల్ గట్టిగా అరిచాడు. అవినాష్ యాక్షన్ చేసి చూపించాడు. సోహైల్ కెమెరా ముందుకు చూస్తూ హలో దెయ్యం ఎక్కడున్నావ్ చూపించండి అంటూ అరిచాడు రాత్రికి మాత్రం రావొద్దన్నాడు దాంతో అందరూ నవ్వారు. హౌజ్‌లోకి దెయ్యాన్ని పంపి భయపట్టే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. అయితే అప్పటికే భయంతో ఉన్న అరియాణా మరింత భయపడింది. మిగతా వారు అంత ఫేక్ అంటూ డ్యాన్సులు చేశారు. హారిక, సోహైల్ స్టేప్స్ వేశారు.

అందరు శానిటైజ్‌ చేసుకుంటున్న సమయంలో బిగ్‌బాస్ హర్రర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేశారు. దాంతో అరియాణా మరోసారి గజగజ వణికింది. అరియాణాను అవినాష్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. హారిక, సోహైల్ డ్యాన్స్ చేశారు. అభిజిత్, మోనాల్ మాత్రం సైలెంట్‌గా కూర్చున్నారు. బిగ్‌బాస్ వాయిస్ కాకుండా మరొకరితో మాట్లాడించారు. దెయ్యం వాయిస్‌తో ఆమె మాట్లాడింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న వారిని ఒక్కొక్కరిని ఇబ్బందులకు గురి చేస్తానని చెప్పింది. కానీ, ఆమె మాటలను ఎవరు నమ్మలేదు. దెయ్యం రూపంలో మహిళ ఒక్కొక్కరి గురించి వివరించింది. అరియాణా గొంతు బాగుందని అవినాష్‌ వాళ్ల అమ్మను మాట్లాడామని దెయ్యం కోరింది.

బిగ్‌బాస్ హౌస్‌లో మోనాల్‌ని అభిజిత్‌, అఖిల్‌ బాగా ఏడ్పించారని, అందుకే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో డేట్‌కు వెళ్లాలని ఫిటింగ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. మోనాల్‌తో డేట్ అనగానే అభిజిత్ ఫీల్ అయ్యాడు. దాంతో ఇదే అంశం ఎపిసోడ్ ఎండింగ్‌ వరకు కొనసాగింది అభిజిత్ భావోద్వేగానికి గురైయ్యాడు. మోనాల్ వల్ల తనకు జరుగుతున్న నష్టాన్ని అంచనా వేశాడు. దెయ్యాన్ని ఎమిటేట్ చేసే ప్రయత్నం చేశారు. అవినాష్, సోహైల్, అఖిల్ కలిసి బాగా నవ్వించారు. మోనాల్‌ని అభిజిత్, అఖిల్ బాగా ఏడ్పించారని, అందుకే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆమెతో డేట్‌కు వెళ్లాలని ఫిటింగ్ పెట్టాడు బిగ్‌బాస్ దాని కోసం అభిజిత్, అఖిల్‌కు క్విజ్ కాంపిటేషన్ ఉంటుందని వెల్లడించారు. దానిలో గెలిచిన వాళ్లు డేట్‌కి వెళ్తారని బిగ్‌బాస్ లెటర్ పంపించారు.

అయితే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను అభిజిత్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అసలు తామిద్దరం కలిసి ఆమెను ఏడిపించడం ఏంటని ప్రశ్నించారు. ఇది బిగ్‌డీల్‌లా అనిపిస్తుందన్నాడు. తనకు ఎక్కడో కొడుతుందని తనకు ఈ మోనాల్ అభిజిత్ ప్రజెక్షన్ వద్దన్నాడు. ఇంట్రెస్ట్ ఉంటే టాస్క్‌ చేయాలి లేదంటే లేదని అఖిల్ అభిజిత్ ను కోరాడు. మోనాల్ పేరు వచ్చిన ప్రతిసారీ తనకు రాడ్ పడుతుందని ఈ టాస్క్‌ వద్దంటే వద్దని అభిజిత్ పట్టుపట్టాడు.

అభిజిత్ తప్పుకోవడంతో మోనాల్‌తో అఖిల్ డేట్‌ వెళ్లే చాన్స్ కొట్టేశాడు. అంతకుముందు ఇంటి సభ్యులకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంటి సభ్యులకు ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను పూర్తి చేయాలని కోరాడు. బిగ్‌బాస్ ఆదేశాలతో అభిజిత్ భావోద్వేగానికి గురైయ్యాడు. అతడిని సోహైల్, హరిక ఓదార్చారు. మోనాల్, అఖిల్‌ కలిసి డేట్‌ కు వెళ్లారు. ఇద్దరు కలిసి గార్డెన్‌ ఏరియాలో మనసు విప్పి మాట్లాడుకున్నారు. అఖిల్‌తో డేట్ అనగానే మోనాల్ చిరునవ్వులు చిందిస్తూ అందంగా తయరైంది. ఆ తర్వాత రాత్రి దెయ్యం బ్యాగ్రౌండ్‌లో భయపట్టే ప్రయత్నం చేశాడు. హౌజ్‌మెంబర్స్ ఇంట్లో అఖిల్ బయట డ్యాన్సులు చేశారు. మరి దెయ్యం ఇంకా ఏమేం టాస్క్‌లు ఇచ్చిందో ఇవాళ్టీ ఎపిసోడ్‌లో చూడొచ్చు. ఇంటి సభ్యులకు ఫిజికల్ టాస్క్ ఇచ్చినట్టు ప్రొమోలో చూపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories