"మా అమ్మ గుర్తొచ్చింది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున

Nagarjuna About Oke Oka Jeevitham Film
x

"మా అమ్మ గుర్తొచ్చింది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున 

Highlights

Akkineni Nagarjuna: అమ్మని తలుచుకుని స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున

Akkineni Nagarjuna: వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న యువహీరో శర్వానంద్ తాజాగా ఇప్పుడు ఒకే ఒక జీవితం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా కథ తెరకెక్కనుంది. శ్రీ కార్తిక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాజర్, రవి రాఘవేంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ నటి అమల అక్కినేని కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మంచి అంచనాల మధ్య ట్రైలర్ తోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది.

తాజాగా ఈ చిత్ర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారు. "సినిమా చాలా ఎమోషనల్ గా అందంగా ఉంది. అమ్మపై ప్రేమ ఉన్న ఎవరికైనా ఈ సినిమా కన్నీళ్లు తెప్పిస్తుంది. సినిమా చూశాక నేను కూడా మా అమ్మని తలుచుకుని ఏడ్చేసాను," అని అన్న నాగార్జున స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్నారు. చెమగిల్లిన కళ్ళు చూస్తే సినిమా చూసి నాగ్ ఏడ్చేసారని చెప్పొచ్చు. "సినిమా ప్రివ్యూ కి మా అమ్మ కూడా రావటం నాకు చాలా విలువైనది. "ఇవాళ నేను ఇలా ఉండటానికి కారణం కేవలం మా అమ్మ మాత్రమే. ఆమెకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను," అని అన్నారు అమల.

Show Full Article
Print Article
Next Story
More Stories