నాగార్జున 100వ సినిమా.. కొడుకుతో కలిసి మల్టీ స్టారర్.. ఆ డైరెక్టర్ మాస్ స్కెచ్..

Nagarjuna 100th Film With Director Mohan Raja
x

నాగార్జున 100వ సినిమా.. కొడుకుతో కలిసి మల్టీ స్టారర్.. ఆ డైరెక్టర్ మాస్ స్కెచ్..

Highlights

నాగ్ 100 సినిమాలో కీలక పాత్ర పోషించనున్న అక్కినేని హీరో

Nagarjuna 100th Film: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మరొక సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో "ది ఘోస్ట్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని నారాయణ దాస్ నారాంగ్, సునీల్ నారంగ్ మరియు రామ్మోహన్ రావు, మరియు శరత్ మారార్ నిర్మించారు.

మార్క్ కే రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. అయితే అదే రోజున మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమా కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున ఇప్పుడు అదే డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

"గాడ్ ఫాదర్" సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోహన్ రాజా దర్శకత్వంలో నాగర్జున కూడా ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున కరియర్లో 100వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో అక్కినేని అఖిల్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories