MAA Elections: "మా" ఎన్నికలపై నాగబాబు హాట్ కామెంట్స్.. ప్రకాశ్‌ రాజ్ పోటీ చేస్తాడని..

MAA Elections: మా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఎన్నికపై హీట్ పెంచుతున్నారు అభ్యర్థులు.

Arun Chilukuri
Published on: 6 Oct 2021 6:31 PM IST
Nagababu Speaks About Prakash Raj Over MAA Elections
X

MAA Elections: "మా" ఎన్నికలపై నాగబాబు హాట్ కామెంట్స్.. ప్రకాశ్‌ రాజ్ పోటీ చేస్తాడని..

MAA Elections: మా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఎన్నికపై హీట్ పెంచుతున్నారు అభ్యర్థులు. ఎన్నికలపై రోజుకొకరు హాట్ కామెంట్ తో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పుడు మెగాబ్రదర్ నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు. ప్రకాశ్ రాజ్‌ చిన్న, పెద్ద సినిమా వాళ్లకు కావాలని నాగబాబు అన్నారు. ఉత్తమ నటుడిగా ఉత్తమ స్థాయిలో ప్రకాశ్‌రాజ్‌ను ఒప్పుకోవాలన్నారు. మా ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్ పోటీ చేస్తాడని అస్సలు ఊహించలేదన్నారు. సినిమాకు కోటి రూపాయలు తీసుకునే దమ్మున్న నటుడు ప్రకాశ్ రాజ్ అని హాట్ కామెంట్ చేశారు.

అసోసియేషన్ కోసం కొన్ని సినిమాలు కూడా వదులుకుంటానని ఆయన నాతో చెప్పారు. ప్రకాశ్‌రాజ్ భారతీయ నటుడు. ఆయన తెలుగువాడు కాదని, విమర్శించే వాళ్లు తమ సినిమాల కోసం మాత్రం కావాలని పాకులాడుతారని నాగబాబు అన్నారు. కోట శ్రీనివాసరావు, బాబుమోహన్‌ లాంటివాళ్లు ప్రకాశ్‌రాజ్ ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఆయన అంటే అంత చులకనా? కోట శ్రీనివాసరావు ఇతర భాషల్లో నటించలేదా? మా అసోసియేషన్‌కు సేవ చేస్తానని వస్తానంటే కించపరుస్తారా.. ప్రకాశ్‌రాజ్‌ను గెలిపించేందుకు నూటికి నూరుశాతం శ్రమిస్తాం. మా అసోసియేషన్ సభ్యులు ఎలాంటి ప్రలోభాలకు గురికావొద్దు అని నాగబాబు పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story