Nagababu: రోజా పై నాగబాబు సెటైరికల్ కామెంట్స్

Nagababu Satirical Comments on Roja
x

నాగబాబు:(ఫైల్ ఇమేజ్)

Highlights

Nagababu: జబర్దస్త్ జడ్జ్ రోజాపై నాగబాబు చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.

Nagababu: సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్నవిషయాలపై స్పందించే మెగా బ్రెదర్ నాగబాబు. 'ఖుషీ ఖుషీగా' పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్టాండప్ కామెడీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జబర్దస్త్ జడ్జ్ రోజాపై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.

అభిమానులతో చిట్ చాట్...

తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌స్టా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసిన మెగా బ్రదర్.. ఈ క్రమంలో.. ''సార్ జబర్దస్త్‌లో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు?'' అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో ఇంకెవరు జబర్దస్త్ జడ్జ్ సీటుపై కూర్చున్న 'రోజా' అంటూ ఆమె ఫొటో కూడా పోస్ట్ చేసి షాకింగ్ సమాధానం ఇచ్చారు నాగబాబు. అయితే నాగబాబు చేసిన ఈ కామెంట్ చూసి నెటిజన్స్ రివర్స్‌లో ఆయనపైనే కౌంటర్స్ వేస్తున్నారు. అంతాబాగానే ఉంది కానీ నాగబాబు చిన్న లాజిక్ మిస్ అయ్యాడంటూ ఆలోచింపజేసే కామెంట్స్ చేస్తున్నారు. 'జడ్జ్ సీటులో కూర్చున్న రోజా కమెడియన్ అయితే ఈయన కూడా జోకర్ అన్నట్లే కదా.. అదే లెక్క మరి' అంటూ లాజిక్స్ మాట్లాడుతున్నారు. అంటే ఏదో రోజాపై సెటైర్ వేద్దామనుకుంటే అదికాస్తా ఆయనపై తగిలి అడ్డంగా ఇరుక్కున్నారనేది నెటిజన్ల మాట.

జబర్దస్త్‌ వేదికపై తమదైన స్టైల్...

ఎందరో కమెడియన్స్ జబర్దస్త్‌ వేదికపై తమదైన స్టైల్ పంచులతో హాస్యం పండిస్తుంటారు. పొట్టచెక్కలయ్యే నవ్వులే టార్గెట్‌గా గత ఏడెనిమిదేళ్లుగా ఈ షో సత్తా చాటుతూనే ఉంది. షో సక్సెస్ కావడంలో కమెడియన్స్ స్కిట్స్ ఒకెత్తయితే అనసూయ, రష్మీ అందాల యాంకరింగ్ మరో ఎత్తు. ఇక జడ్జెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. షో మొదలైనప్పటి నుంచి నవ్వుల రారాజు నాగబాబు, రోజా కొన్నేళ్ల పాటు జడ్జ్‌లుగా కొనసాగారు. అయితే ఇటీవలే ఈ సీటు నుంచి తప్పుకున్న నాగబాబు ఆ తర్వాత 'అదిరింది' లాంటి కామెడీ షోస్ చేసి చివరకు వాటికీ ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories