Nagababu: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. చిరంజీవి, సుస్మితను గుర్తుచేసుకున్న నాగబాబు

Nagababu Reacts on Ahmedabad Air India Plane Crash
x

Nagababu: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. చిరంజీవి, సుస్మితను గుర్తుచేసుకున్న నాగబాబు

Highlights

Nagababu: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తనని కలిచివేసిందని నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Nagababu: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తనని కలిచివేసిందని నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి తన ప్రగాడ సానుభూతిని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఒక పక్క విమానం ప్రమాదంలో చనిపోయిన వారు, మరో పక్క హాస్టల్‌పై విమానం కూలిపోవడంతో చనిపోయిన మెడికోలు... ఈ రెండూ కూడా తనని చాలా కలిచివేశాయని నాగబాబు ఎమోషనల్ అయ్యారు.

గొంతు పూడుకుపోతుందని, ఏడుపు రావడం లేదని అన్నారు. దేవుడున్నాడని నమ్మే వాళ్లు ఈ విమానంలో ఉండి ఉంటారు కదా మరి అలాంటప్పుడు దేవుడు వారిని ఎందుకు కాపాడలేకపోయారని అన్నారు. చనిపోయిన మెడికోలు ఎన్ని ఆశలతో డాక్టర్ చదువుతున్నారోనని.. వారి తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారోనని బాధపడ్డారు. కొన్ని గంటలైతే తమ వాళ్లను చేరుకుంటాం కదా అని ఎన్నో ఆశలతో వెళుతున్న వారు ఇలా మధ్యలోనే చనిపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ శతాబ్ధానికి ఇంతకన్న పెద్ద ఆపద రాదు రాకూడదని నాగబాబు కోరుకున్నారు.

విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని... ఆ విజువల్స్ ఇంకా ఇప్పటికీ మనసులో నుండి పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది యువతీయువకులు తమ భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కి ఉంటారు. మరికొంతమంది బంధువులను, తమ వాళ్లను కలిసేందుకు ప్రయాణమై ఉంటారు. పసిపిల్లలు తమ తల్లి దగ్గర క్షేమంగా ఉన్నామనుకున్న పసిపిల్లలు, పెద్దవాళ్లు, విమాన సిబ్బంది, ఎంతో అనుభవం ఉన్న పైలెట్లు, అసలు ఈ ఫ్లైట్‌తో సబంధం లేని మెడికో స్టూడెంట్స్ .. ఈ ప్రమాదంలో తమ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు.

ఒకసారి విమానం ప్రమాదంలో చిక్కుకున్న తన తమ్ముడు చిరంజీవి అతని కుమార్తె సుస్మిత గురించి తలుచుకుని నాగబాబు బాధపడ్డారు. ఒకసారి ఎంతోమంది సినిమా వాళ్లున్న ఫ్లైట్‌లో చిరంజీవి, సుస్మిత ఉన్నారని, అకస్మాత్తుగా ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయిందని తెలిసిందని, ఆ సమయంతో తన తమ్ముడు, సుస్మిత ఎలా ఉన్నారో అన్న ఆంధోళన చెందామని గుర్తుచేసుకున్నారు. అయితే ఆ తర్వాత విమానంలో అందరూ సేఫ్‌గా వచ్చినట్టు తెలుసుకుని కుదుటపడ్డానని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories