Sai Pallavi: వరుణ్ తేజ్ - సాయి పల్లవికి పెళ్లి! మెగా ఫ్యాన్స్ కి షాకిచ్చిన నాగబాబు

Sai Pallavi: ప్రముఖ సౌత్ ఇండియన్ హీరోయిన్ సాయి పల్లవి.. తన నటనతో చాలా మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

Venkata Chari
Published on: 7 April 2021 4:17 PM IST
Nagababu Hilarious Reply to a Fan on Varun Tej and Sai Pallavi Marriage
X

సాయి పల్లవి, వరుణ్ తేజ్ (ఫొటో యూట్యూబ్)

Sai Pallavi: ప్రముఖ సౌత్ ఇండియన్ హీరోయిన్ సాయి పల్లవి.. తన నటనతో చాలా మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆమె నటనే కాదు, డ్యాన్స్, స్మైల్, సామాజిక వ్యక్తిత్వం అందరికి నచ్చుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నా ఫ్యాన్స్ తో ఎక్కువగా ఇంటరాక్షన్ అవ్వదు.

ఒక నటి తన కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు.. వాళ్ల ఇంటర్వ్యూలతో మీడియా సంస్థలు హాడావుడి చేస్తాయి. అలాగే అభిమానులు, మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వాళ్ల వివాహాలపై పుకార్లు సాధారణంగా వినిపిస్తుంటాయి. ప్రస్తుతం ఫిదా బ్యూటీపై కూడా ఇలాంటి చర్చే మొదలైంది.

మెగా స్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు అభిమానులతో సోషల్ మీడియాలో రెగ్యూలర్ గా టచ్ లో ఉంటారు. మెగా ఫ్యాన్స్ నాగబాబుని తరచుగా చాలా ప్రశ్నలు సంధిస్తుంటారు.

ఈ క్రమంలో రీసెంట్‌గా మరోసారి అభిమానులతో చిట్ చాట్ చేశాడు నాగబాబు. 'వరుణ్ అన్నా సాయి పల్లవికి మ్యారేజ్ చేస్తా సార్..వాళ్ల జోడీ బాగుంటుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన నాగబాబు 'జాతి రత్నాలు' సినిమాలోని క్లైమాక్స్ సీన్ లో బ్రహ్మానందాన్ని వాడేస్తూ వరుణ్ పెళ్లిపై నెటిజన్ వేసిన ప్రశ్నను దాటవేశారు.

అందులో కోర్ట్ సీన్‌లో జడ్జ్‌గా ఉన్న బ్రహ్మానందం 'తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక, నేనేందుకు.. ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే' అనే డైలాగ్ చెబుతారు. ఈ ఫన్నీ వీడియోనే నాగబాబు పోస్ట్ చేశారు.

శేకర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన "ఫిదా" సినిమాలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో మెగా అభిమానుల్లో ఈ జంట పై చాలా హోప్స్ పెరిగాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే నాగబాబుకు వారి వివాహం చేయాలని సూచించాడు ఓ అభిమాని. అయితే, వరుణ్ తేజ్, సాయి పల్లవి మ్యారేజ్ పై ఇంతవరకు ఎలాంటి రూమర్స్ రాలేదు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడంతో ఏం జరుగుతుందో చూడాలి.

Venkata Chari

Venkata Chari

Next Story