వరుణ్ పుట్టినరోజు సందర్భంగా నాగబాబు అరుదైన ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్

మెగా కుటుంబం నుంచి హీరోగా వెండితెరపై ఆరంగేట్రం చేసినప్పటికీ వరుణ్ తేజ్ విలక్షణ కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ దున్నేస్తున్నాడు.

Samba Siva Rao
Updated on: 19 Jan 2021 4:48 PM IST
Nagababu Family Photo
X

మెగా కుటుంబం నుంచి హీరోగా వెండితెరపై ఆరంగేట్రం చేసినప్పటికీ వరుణ్ తేజ్ విలక్షణ కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ నటన కనబర్చుతున్నాడు. ఇవాళ్టితో ఆయన పుట్టిన రోజు సందర్భంగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వరుణ్ తండ్రి మెగా బ్రదర్ నాగబాబు ఢిఫెరట్ గా బర్త్ డే విషెశ్ చెప్పారు. వరుణ్ చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియా వేదిగా పంచుకున్నారు. ''పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న'' అంటూ కామెంట్ పెట్టారు. ఈ అదురైన పిక్‌లో వరుణ్ తేజ్, నిహారిక ఇద్దరూ చాలా చిన్నపిల్లలుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించిన చిత్రం 'గని'. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story