మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ పై స్పందించిన మెగా బ్రదర్

మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ పై స్పందించిన మెగా బ్రదర్
x
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తీస్తే బాగుంటుందని మెగా అభిమానులు...

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తీస్తే బాగుంటుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు. అలాంటి చిరంజీవి బయోపిక్ తీస్తే అందరికీ ఆదర్శంగా ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఈ అభిప్రాయం మాత్రం మెగా బ్రదర్ నాగబాబు కు లేదట. తాజాగా ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ బాబు మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ పై స్పందించారు.

అన్నయ్య బయోపిక్ తీసే ఆలోచన తనకైతే అసలు లేదు అలాగే చరణ్ కు కూడా ఉండదని భావిస్తున్నట్లు తెలిపారు. "సినిమా అంటే అప్ అండ్ డౌన్స్, హ్యాపీ, సాడ్ ఉండాలి. కాని అన్నయ్య జీవితంలో అలాంటివి తక్కువగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోదు. సావిత్రి గారు, సిల్క్ స్మిత బయోపిక్ లలో కొన్ని ముఖ్య ఘట్టాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. అందుకే సినిమాను చూశారు. కాని అన్నయ్య బయోపిక్ లో అలాంటివి ఏమీ లేవు. అందుకే అన్నయ్య బయోపిక్ ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా తీసే ఆలోచన లేదని నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories