నాగబాబు అదిరింది షో.. కొత్త పేరుతో పాత సరుకు!!

నాగబాబు అదిరింది షో.. కొత్త పేరుతో పాత సరుకు!!
x
Highlights

నాగబాబు జబర్దస్త్ వదిలేయడమే సంచలనం.. దానికి కొనసాగింపుగా 'జీ తెలుగు' లో 'అదిరింది' చేయడం ఇంకో సంచలనం.. కానీ, అదిరింది అనుకున్నట్టుగా అదరకపోవడమూ సంచలనమే!

జబర్దస్త్ వదిలేసి.. అదిరింది అని నాగబాబు చేసిన ప్రయత్నంలో కొత్తదనం కనిపించలేదనేది ప్రేక్షకుల అభిప్రాయం. జీ తెలుగులో ఆదివారం ప్రసారమైన మొదటి ఎపిసోడ్ జబర్దస్త్ కి జిరాక్స్ లా అనిపించిందని నాగబాబు అభిమానులే అంటున్నారు. లోగో దగ్గర నుంచి.. స్కిట్ ల వరకూ జబర్దస్త్ కి కొనసాగింపులా ఉంది తప్ప మరో కొత్త షో చూసిన అనుభూతి దక్కలేదని వీక్షకులు పెదవి విరుస్తున్నారు. నిజంగా అదిరింది అలానే ఉందా? అసలు అదిరింది షో కి జబర్దస్త్ కి తేడా ఏమి ఉంది? పరిశీలిస్తే..

గురు శుక్ర వారాల్లో ఈ టీవీలో జఙ్గబర్దస్థ్, ఎగస్ట్రా జబర్దస్త్ పేరిట రెండు కార్య క్రమాలు వీక్షకుల్ని పలకరిస్తాయి. రెండు షో లో టీఆర్ఫీలో టాప్ ప్లేస్ లో ఉంటూ వస్తున్నాయి. జబర్దస్త్ ప్రారంభమై ఏడేళ్లు దాటింది. ఇన్నేళ్ళుగా జబర్దస్త్ న్యాయ నిర్ణేతలుగా నాగబాబు, రోజా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు నాగబాబు కి జబర్దస్త్ నిర్మాతలతో సమస్య వచ్చింది. ఆయన బయటకు వెళ్లి జీ తెలుగు లో అదిరింది కార్య్కర్మాన్ని భుజాన వేసుకున్నారు. ఆయన తో పాటు జబర్దస్త్ నుంచి అనసూయ, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, కిరాక్ ఆర్ఫీ వెళ్ళిపోతారని ప్రచారం జరిగింది. కానీ, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్ఫీ మాత్రమే వెళ్లారు. మిగిలిన వాళ్ళు జబర్దస్త్ లోనే ఉండిపోయారు.

అన్నీ తానై..

జబర్దస్త్ షో లో నాగబాబు న్యాయ నిర్ణేతగా మాత్రమే ఉండేవారు. ప్రచార కార్య్కర్మాణాలను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ, అదిరింది షో కి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. టీమ్ ఎంపిక దగ్గరనుంచి ప్రమోషన్ వరకూ అన్నిటినీ నాగబాబు తన భుజాల మీద వేసుకున్నారని తెలుస్తోంది. జబర్దస్త్ నిర్మాతలతో వచ్చిన తీవ్రమైన అభిప్రాయం బేధాలతోనే అదిరింది షో ను ఎలాగైనా జబర్దస్త్ ను మించి చేయాలని నాగబాబు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అదిరింది షో పై అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే, మొదటి ఎపిసోడ్ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి.

యాంకర్ డల్!

అదిరింది షో మొదటి ఎపిసోడ్ చూసిన వారికి యాంకర్ సమీరా కొంత నీరసం తెప్పించిందనే చెప్పాలి. జబర్దస్త్ తో పోలిస్తే.. అనసూయ, రష్మీ ల యాంకరింగ్ అలవాటైపోయిన వీక్షకులకు సమీరా యాంకరింగ్ అసలు కిక్ ఇవ్వలేదు. ఆమె యాంకరింగ్ విషయంలో చాలా చాలా వెనుకబడి ఉందని అందరూ చెబుతున్నారు.

అదీ ఇదీ ఒకటే..

ఇక లోగో.. జబర్దస్త్ లోగోకి భిన్నంగా ఏమీ లేదు. స్టేజి కూడా అంతే.. అదే సెట్టింగ్.. అదే డెకరేషన్. కొత్త షో లో ఎదో చూద్దామని అననుకుంటే అసలు ఎప్పటిలానే అదేరకం డెకరేషన్ కనబడింది ప్రేక్షకులకు.

అంతా పాత వాళ్ళే..

ఆదివారం నాలుగు స్కిట్లు అదిరింది లో కనిపించాయి. నాలుగు టీములు ఉన్నాయి. చమ్మక్ చంద్ర, ఆర్ఫీ ఇద్దరూ జబర్దస్త్ నుంచి నేరుగా ఇక్కడకు వచ్చేశారు. ఇక వేణు, ధనరాజు జబర్దస్త్ మొదట్లో మెరిసిన వారు. వారిద్దరూ అక్కడ నుంచి బయటకు వెళ్లి.. ఇప్పుడు అదిరింది స్టేజి మీద కనిపించారు. దీంతో కనీసం కొత్త టీమ్ లు కూడా లేని పారిస్తాయి ప్రేక్షకులకు ఎదురైంది. ఇది వారిని నిరాశ పరిచిందని చెప్పాలి.

మితిమీరిన ప్రచార సరళి..

నాగబాబు ఆధ్వర్యంలో సాగిన అదిరింది ప్రచారంలో జబర్దస్త్ ను మించి ఉంటుందనే భావన ప్రేక్షకులకు కలిగించారు. అదే ఉత్సాహంతో జీతెలుగు ముందు కూర్చున్న ప్రేక్షకులకు కొత్త పేరుతో పాత కార్య క్రమం చూస్తున్న భావన కలిగింది. నిజానికి ఇది మొదటి ఎపిసోడ్. పరిచయాల స్కిట్ లే ఇందులో ఉన్నాయి. కానీ, ప్రేక్షకులకు అవన్నీ అవసరం లేదు. షో కొత్తగా ఉందా లేదా అనే చూస్తారు.

న్యాయ నిర్ణేత నాగబాబు..

నాగబాబు న్యాయ నిర్ణేతగా అదరగొట్టేశాడు. కానీ, అయన పక్కన నీహారికా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఆ స్థానానికి కొంత స్థాయి ఉంటుంది. రోజా-నాగబాబు లాంటి కాంబినేషన్ అందరూ కోరుకుంటారు. దానికి పూర్తి భిన్నంగా ఇది ఉండడంతో నిరాశ కలిగించిందని చెప్పాలి.

మొత్తమ్మీద మొదటి ఎపిసోడ్ సో..సో గానే ఉదనేది నిజం. జబర్దస్త్ లాంటి కామెడీ షో ను ఎదుర్కోవడానికి ఇది సరిపోదు. ఈ విషయం బహిరంగ రహస్యమే. కచ్చితంగా వీక్షకులు ఈ షో ను జబర్దస్త్ తో ప్రతి వారం పోల్చి చూస్తారు. అందుకే మరింత వినోదం కావాలి.. అదీ విభిన్నంగా.. మరి రాబోయే ఎపిసోడ్ లలో అదిరింది ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories