ఈవయసులో పుట్టింటోళ్ళు తరిమేయడం ఏమిట్రా బాబూ.. నాగబాబు పంచ్ అదిరింది!

ఈవయసులో పుట్టింటోళ్ళు తరిమేయడం ఏమిట్రా బాబూ.. నాగబాబు పంచ్ అదిరింది!
x
Adhirindi 3rd episode promo (images screen shots from zee telugu promo vedio)
Highlights

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన నాగబాబు అదిరింది షో తో మెరుస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతోంది. ఇక...

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన నాగబాబు అదిరింది షో తో మెరుస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతోంది. ఇక తాజాగా ఈరోజు (05. 01.2020) ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ ఎపిసోడ్ ల కంటే ఈ ఎపిసోడ్ లో కామెడీ డోస్ పెరిగినట్టు కనిపిస్తోంది. యాంకర్లు.. జడ్జిలపై కూడా గట్టి పంచ్లు దానికి తగ్గ ఆర్ ఆర్ లో ఈ ప్రోమోలో ఆకట్టుకున్నాయి.

ఈ ఎపిసోడ్ కి నాగబాబుతో పాటు నవదీప్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

పుట్టింటోళ్ళూ తరిమేశారు అంటూ చమ్మక్ చంద్ర ఏజ్డ్ లేడీ గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు ఈ వయసులో పుట్టింటోళ్ళు తరిమేయడం ఏమిట్రా బాబూ అంటే వెంటనే.. నవదీప్ వీళ్ళకి లేటుగా పెళ్లయినట్టుందండీ అంటూ పంచ్ వేశారు. ఇక ఆ లేడీ గెటప్ భర్త ఫోటో లో చేరినట్టు చూపించారు. చంద్ర లేడీ గెటప్ లో వేస్తున్న చిందులకు ఆ ఫోటో ఫ్రేమ్ పగిలిపోతుంది. మళ్ళీ వెంటనే ఇంకో పంచ్ చంద్ర వేస్తాడు. దానికి నాగబాబు పగిలిపోయిన ఫ్రేమ్ ను ఎన్నిసార్లు పగలగొడతావయ్యా అంటూ అనడంతో నవ్వులు పూశాయి.

వేణూ తన తండ్రి పాత్ర తో నీ చేతిలో రేఖ నాగబాబు గారంత పొడుగ్గా ఉంది నాన్నా.. కానీ, నీ నుదిటి మీద రాత నా అంత పొట్టిగా ఉంది అని వేసిన పంచ్ నవ్వించింది.

డాక్టర్ గా ధనరాజ్ పేషంట్ రక్తం సిరెంజిలతో తీసి క్లీన్ చేశాడు. పేషంట్ డాక్టర్ రక్తం కారిపోతోంది అంటే, అబ్బా మీ రక్తం మీ మాట విననప్పుడు.. నా మాటేం విటుంది అంటూ పంచ్ వేశాడు. ఇంకా.. హార్ట్ లో హోల్ ఉందని అంటున్న పేషేంట్ ను నిలబెట్టి అతని వెనుక కాంపౌండరును నిలబెట్టి టార్చ్ లైట్ వేసి అటువైపు పడుతుందా అని డాక్టర్ ధనరాజ్ అడగడం కడుపుబ్బా నవ్వించింది.

ఇంకా మెట్రో పనులన్నా అవుతాయి కానీ, ఈ పనులు కావురా.., వంటి పంచ్ లు చాలానే ఉన్నాయి ఈ ప్రోమోలో.. యాంకర్ సమీరా మొదటి ఎపిసోడ్ కంటే ఇప్పుడు కొంచెం బాగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక రెండో జడ్జిగా నాగబాబుతో పాటు కనిపిస్తున్న నవదీప్ కూడా షో కి ప్లస్ అవుతున్నారు ఈ ప్రోమో చూస్తుంటే అనిపించింది. ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ అసలు విషయం ఉందోలేదో తేలదు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories