శౌర్య సినిమా ఇంకోటి ఆగిపోయింది

Ruthvik
Published on: 13 April 2019 10:52 AM IST
శౌర్య సినిమా ఇంకోటి ఆగిపోయింది
X

యువ హీరోల్లో బిజీ గా గడుపుతున్న హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు నాగ శౌర్య. చలో లాంటి పెద్ద విజయం సాధించాక దాన్ని నిలబెట్టుకోవడం లో శౌర్య పూర్తి గా విఫలమయ్యాడు అని చెప్పచ్చు. ఆ తర్వాత వచ్చిన అమ్మమ్మ గారి ఇల్లు, నర్తనశాల పరాజయం చవి చూశాయి. ఇక ఏం చేయాలి అని ఆలోచిస్తున్న దశ లో సమంత తదుపరి చిత్రం లో ఒక కీలక పాత్ర చేసే అవకాశం దక్కింది శౌర్యకు. ఇది చేసుకుంటూ మరో పక్క తన సొంత ప్రాజెక్ట్స్ ని సెట్ చేసే పని లో ఉన్న శౌర్య కి ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది అని చెప్పచ్చు.

సుకుమార్ నిర్మాణం లో ఒక సినిమా అనుకున్న శౌర్య, సడన్ గా ఆ సినిమా ఆగిపోవడం తో డీలా పడ్డాడు. ఇదిలా ఉంటె, ఆనంద్ ప్రసాద్ నిర్మాణం లో ఈషా రెబ్బ సరసన రాజా కొలుసు దర్శకత్వం లో ఒక సినిమా ని ప్రకటించగా ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. హీరో కి దర్శకుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఈ సినిమా ఆగిపోయింది అని సమాచారం. ప్రస్తుతం శౌర్య ముందు ఉన్న ప్రాజెక్ట్ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో త్వరలో ప్రారంభం కానున్నది.

Ruthvik

Ruthvik

Next Story