Naga Shaurya: "మజిలీ" భామతో నాగశౌర్య న్యూ మూవీ!

Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Venkata Chari
Published on: 13 March 2021 4:11 PM IST
Naga Shaurya gives chance to flop heroine
X

హీరో నాగశౌర్య (ఫైల్ ఫొటో)

Naga Shaurya: నాగ శౌర్య ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి "వరుడు కావలెను", మరొకటి "లక్ష్య" సినిమాలు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. "పోలీసు వారి హెచ్చరిక" అనే మరో కొత్త సినిమాకు కూడా సైన్ చేశాడంట. అయితే, ఈ సినిమాలో లీడ్ రోల్ హీరోయిన్ గా నాగచైతన్య మజిలీ సినిమాలో హీరోయిన్‌ "దివ్యాన్షా కౌశిక్" ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

మజిలీ సినిమా తరువాత ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్లు రాలేదు. చాలా కాలం తరువాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులను "పోలీసు వారి హెచ్చరిక" సినిమాతో కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ చిత్రంలో ఆమె నటనకు ఆస్కారం ఉండే అవకాశముందని సమాచారం.

ఫ్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ చిత్రానికి రాజేంద్ర కొలుసు డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. మహేష్ ఎస్ కొనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Venkata Chari

Venkata Chari

Next Story