నాగశౌర్య సినిమాకి రేపే టైటిల్ ప్రకటన!

నాగశౌర్య సినిమాకి రేపే టైటిల్ ప్రకటన!
x
Highlights

నాగశౌర్య నటిస్తున్న 20 వ సినిమాకి రేపు టైటిల్ ప్రకటించనున్నారు. రేపు సాయింత్రం 5: 04 కు సినిమా పేరును చిత్ర యూనిట్ వెల్లడించనుంది. క్రీడా నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంతోష్ జాగార్లపుడి దర్శకత్వం వహించనున్నారు.

నాగశౌర్య నటిస్తున్న 20 వ సినిమాకి రేపు టైటిల్ ప్రకటించనున్నారు. రేపు సాయింత్రం 5: 04 కు సినిమా పేరును చిత్ర యూనిట్ వెల్లడించనుంది. క్రీడా నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంతోష్ జాగార్లపుడి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన నాగశౌర్య ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి వీపరితమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్, ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories