పరశురాం పై రివెంజ్ తీర్చుకుంటున్న నాగచైతన్య

Naga Chaitanya: ఈ మధ్యనే "బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్న యువహీరో నాగచైతన్య

Arun Chilukuri
Updated on: 4 July 2022 6:00 PM IST
Naga Chaitanyas Tit for Tat
X

పరశురాం పై రివెంజ్ తీర్చుకుంటున్న నాగచైతన్య

Naga Chaitanya: ఈ మధ్యనే "బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్న యువహీరో నాగచైతన్య తాజాగా ఇప్పుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో "థాంక్యూ" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. అయితే పరశురాం డైరెక్షన్లో కూడా నాగచైతన్య ఒక సినిమా ఓకే చేశారు. దీనికి "నాగేశ్వరరావు" అనే టైటిల్ ను దర్శక నిర్మాతలు అనుకున్నారు.

మహేష్ బాబుతో "సర్కారు వారి పాట" సినిమా తర్వాత పరశురామ్ చేయబోయే సినిమా ఇదే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే లాగా కనిపించడం లేదు. ప్రస్తుతం నాగచైతన్య తన ఫోకస్ మొత్తం వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయబోతున్న తెలుగు, తమిళ్ బైలింగువల్ సినిమా పైనే పెట్టబోతున్నారు. మరోవైపు బాలీవుడ్ లో "లాల్ సింగ్ చద్దా", మరియు "దూత" అనే వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉన్న నాగచైతన్య మరొక యువ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

నిజానికి "సర్కారు వారి పాట" సినిమాకి ముందే ఈ కాంబినేషన్ ఓకే అయింది. కానీ మహేష్ బాబు తో సినిమా అవకాశం రాగానే పరశురాం నాగచైతన్య తో తర్వాత సినిమా చేస్తానని చెప్పి మహేష్ బాబు సినిమాని పట్టాలెక్కించారు. అలా తనని వెయిటింగ్ లో పెట్టినందుకు నాగచైతన్య ఇప్పుడు ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నాడు అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరి సినిమా పట్టాలెక్కడానికి కనీసం ఎనిమిది నెలలైనా పట్టేలా కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story