Love Story: లవ్ స్టోరీ రీషూట్ తో బిజీగా ఉన్న నాగ చైతన్య

Naga Chaitanyas Love Story In Reshoot
x

Love Story: లవ్ స్టోరీ రీషూట్ తో బిజీగా ఉన్న నాగ చైతన్య

Highlights

Love Story: నాగచైతన్య మరియు సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన "లవ్ స్టోరీ" సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

Love Story: నాగచైతన్య మరియు సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన "లవ్ స్టోరీ" సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాని మొదట సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. అయితే దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ త్వరలో థియేటర్ల గురించి, టికెట్ రేట్ గురించి తుది నిర్ణయాన్ని ఇంకా తీసుకోవాల్సి ఉంది.

అయితే సినిమా వాయిదా పడటానికి కారణం ఇంకొకటి కూడా ఉందట. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేస్తున్నారట. అందుకే సినిమాని వాయిదా వేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొన్ని సీన్లలో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేసి ఫైనల్ వెర్షన్ ను తయారు చేద్దామని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య ఇప్పుడు నిజామాబాద్ లో సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 1న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories