Thank You: యూరప్ షూటింగ్ ఆగిపోయింది?

Thank You: నాగా చైతన్య ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉండే నటుల్లో ఒకరు.

Venkata Chari
Published on: 2 May 2021 10:20 PM IST
Naga Chaitanyas Europe shoot halted unexpectedly?
X

నాగ చైతన్య (ఫొటో ట్విట్టర్)

Thank You: నాగ చైతన్య ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉండే నటుల్లో ఒకరు. ప్రస్తుతం 'మనం' సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి 'థాంక్ యూ' అనే సినిమాలో పనిచేస్తున్నాడు.

తాజా సమాచారం మేరకు, 'థాంక్ యూ' సినిమా షూటింగ్‌ ఐరోపాలో జరుగుతోంది. అయితే అనుకోని సమస్యలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి పరిస్థితి కారణంగా అనేక దేశాల నుంచి ఇండియాకు విమానాలు రద్దు చేశారు.

కాబట్టి, ఇటలీలో షూట్ ఆగిన వెంటనే హైదరాబాద్‌కు తిరిగి రావాలని "థాంక్ యూ" బృందం నిర్ణయించింది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించడానికి ఈ బృందం గత వారం ఇటలీకి వెళ్ళింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా.. నాగ చైతన్యతో రొమాన్స్ చేయనుంది.

దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడు. కాగా, రాశీ ఖన్నా, నాగ చైతన్యతో జతకట్టడం ఇది రెండోసారి.

Venkata Chari

Venkata Chari

Next Story