Naga Chaitanya: 1990 ల బ్యాక్ డ్రాప్ తో నాగ చైతన్య

Naga Chaitanya: పీరియడ్ బ్యాక్ డ్రాప్ సినిమాతో నాగచైతన్య

admin1
Updated on: 9 March 2022 11:00 AM IST
Naga Chaitanya with Period Backdrop Movie | Tollywood News
X

 పీరియడ్ బ్యాక్ డ్రాప్ సినిమాతో నాగచైతన్య

Naga Chaitanya: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం "థాంక్యూ" సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఒక తమిళ్ తెలుగు బై లింగువల్ సినిమా చేయబోతున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. 2014లో "ఒక లైలా కోసం" సినిమాలో కలిసి నటించిన ఈ జంట మళ్లీ దాదాపు 7 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని తెలుస్తోంది.

సినిమా కథ 1990 ల బాక్ డ్రాప్ తో సాగుతుందని తెలుస్తోంది. తమిళ్ లో మంచి పేరున్న వెంకట్ ప్రభు కి తెలుగులో ఇదే మొదటి సినిమా. మరి పీరియడ్ బ్యాక్ డ్రాప్ అంటే సినిమా కథ ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే దీని గురించి అధికారిక ప్రకటన మరియు సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక చై ఈ మధ్యనే "దూత" అనే సిరీస్ ను సైన్ చేశారు. మరోవైపు అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చెడ్డ" సినిమాతో నాగచైతన్య బాలీవుడ్లో కూడా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story