Naga Chaitanya: ప్రియాంకతో రొమాన్స్ చేయనున్న చైతూ?

Naga Chaitanya to romance Priyanka?
x

నాగ చైతన్య, ప్రియాంక అరుల్ మోహన్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Naga Chaitanya: నాగార్జున కలల ప్రాజెక్టులలో బంగర్రాజు ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ పై అంచానాలు హై రేంజ్‌లో ఉ్నానాయి.

Naga Chaitanya: నాగార్జున అక్కినేని కలల ప్రాజెక్టులలో బంగర్రాజు ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ పై అంచానాలు హై రేంజ్‌లో ఉ్నానాయి. కానీ, పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారభించేందుకు ఆలస్యం అవుతోంది. ఎట్టకేలకు కరోనా మహమ్మారి తగ్గిన తరువాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, షూటింగ్ మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉంది టీం.

ఈ సినిమాలో నాగార్జున బంగర్రాజుగా కనిపించనున్నారు. నాగార్జున సరసన రమ్య కృష్ణ నటించనుంది. నాగ చైతన్య కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్న సంగతి తెలిసిందే. అయితే, చైతూకి జంటగా ప్రియాంక అరుల్ మోహన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు, ఈ పాత్ర కోసం సమంతా పేరు వినిపించినా.. ప్రస్తుతం ప్రియాంక మోహన్ నాగా చైతన్యతో రొమాన్స్ చేసేందుకు బోర్డులో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకుడు. అనుప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories