శింబు డైరెక్టర్ తో చేతులు కలపనున్న నాగ చైతన్య

Naga Chaitanya: "మానాడు" డైరెక్టర్ తో అక్కినేని హీరో సినిమా

admin1
Updated on: 4 April 2022 7:31 PM IST
Naga Chaitanya To Join Hands With Simbu Director
X

శింబు డైరెక్టర్ తో చేతులు కలపనున్న నాగ చైతన్య

Naga Chaitanya: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో నాగచైతన్య తాజాగా ఇప్పుడు "థాంక్యూ" సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు "లాల్ సింగ్ చద్దా" అనే సినిమాతో బాలీవుడ్లో సైతం అడుగు పెట్టబోతున్న నాగచైతన్య వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే శింబు హీరోగా నటించిన "మానాడు" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకట్ ప్రభు తాజాగా ఇప్పుడు నాగచైతన్య హీరోగా ఒక సినిమా చేయబోతున్నారని టాక్ నడుస్తోంది.

ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. "ఒక లైలా కోసం" సినిమా తర్వాత నాగచైతన్య పూజా హెగ్డే కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరోవైపు నాగచైతన్య నందిని రెడ్డి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. అలాగే ఒక వెబ్ సిరీస్ లో కూడా కనిపించబోతున్నారు.

admin1

admin1

Next Story