Naga Chaitanya: గతంలో ఇలా ఉండేవాడిని కాదు.. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా..

Naga Chaitanya: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగచైతన్య...

Arun Chilukuri
Updated on: 23 July 2022 8:00 PM IST
Naga Chaitanya Talks About Life After Separation From Samantha
X

Naga Chaitanya: గతంలో ఇలా ఉండేవాడిని కాదు.. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా..

Naga Chaitanya: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగచైతన్య పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోయింది అనే చేదు నిజాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరూ తమ వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ జీవితాల్లో ముందుకు సాగిపోతున్నారు.

తాజాగా కాఫీ విత్ కరణ్ షో కి గెస్ట్ గా వెళ్లిన సమంత విడాకుల గురించి ఓపెన్ అప్ అయింది. విడాకులు తీసుకుంటున్నప్పుడు తాను చాలా బాధలో ఉన్నానని కానీ ఇప్పుడు కొంచెం పరవాలేదని చెప్పింది సమంత. "మీరు మీ భర్త విడిపోవాలి అనుకుంటున్నప్పుడు" అని హోస్ట్ కరణ్ జోహార్ ప్రశ్న అడుగుతుండగా సమంత అతనిని ఆపేసి భర్త కాదు మాజీ భర్త అని సీరియస్ గా చెప్పటం నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతేకాకుండా "మా ఇద్దరినీ ఒక గదిలో పెడితే పదునుగా ఉండే వస్తువులను దాచేయాలి" అంటూ ఘాటుగానే చెప్పుకొచ్చింది సామ్.

తాజాగా వ్యక్తిగత ప్రశ్నలకు దూరంగా ఉండే నాగచైతన్య కూడా తన తదుపరి సినిమా "థాంక్యూ" ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ గతంలో తను ఇంత ఓపెన్ గా ఉండేవాడిని కాదని అన్నారు. "నా కుటుంబం మరియు నా ఫ్రెండ్స్ తో ఇప్పుడు అనుబంధం మరింతగా పెరిగింది. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పకొచ్చారు చై.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story