Naga Chaitanya: "లాల్ సింగ్ చెడ్డా" గురించి చెబుతున్న నాగ చైతన్య

* ఈ వెబ్ సిరీస్ కి "రారండోయ్ వేడుక చూద్దాం", "మనం" ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు

admin1
Updated on: 9 Oct 2021 12:08 PM IST
Naga Chaitanya Soon Entering into the Digital Platform with a Horror Web Series Says in an Interview of Love Story Promotions
X

"లాల్ సింగ్ చెడ్డా" గురించి చెబుతున్న నాగ చైతన్య

Naga Chaitanya - Web Series: ప్రస్తుతం యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య "లవ్ స్టోరీ" సినిమా తో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్న చైతన్య తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నాగ చైతన్య కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అటు డిజిటల్ ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నాడట. నాగచైతన్య త్వరలోనే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా దృష్టి పెట్టబోతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య ఒక హారర్ వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ కి "రారండోయ్ వేడుక చూద్దాం", "మనం" ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అటు సినిమాలతో కూడా చై ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాగచైతన్య థాంక్యూ తో కూడా బిజీగా ఉన్నాడు. ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న"లాల్ సింగ్ చెడ్డా " సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. "లాల్ సింగ్ చెడ్డ" సినిమాలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని ఇక ఈ సినిమా తర్వాత కూడా తెలుగు సినిమాల పైన దృష్టి పెడతానని అంటున్నాడు చై.

admin1

admin1

Next Story