Nagarjuna: నాగార్జున నోట చైతూ-శోభిత పెళ్లి అప్‌డేట్స్

Naga Chaitanya-Sobhita Wedding: నాగచైతన్య, శోభిత వివాహం చాలా సింపుల్‌గా చేస్తున్నట్టు నాగార్జున తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Nov 2024 5:28 PM IST
Naga Chaitanya-Sobhita Wedding
X

Nagarjuna: నాగార్జున నోట చైతూ-శోభిత పెళ్లి అప్‌డేట్స్

Naga Chaitanya-Sobhita Wedding: హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లికి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వేదిక కానుంది. డిసెంబర్ 4న జరగనున్న ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ పెళ్లి ఎలా జరగబోతోంది, పెళ్లి వేదిక గురించి తాజాగా నాగార్జున ఆసక్తికర ఆప్‌డేట్ ఇచ్చారు.

నాగచైతన్య, శోభిత వివాహం చాలా సింపుల్‌గా చేస్తున్నట్టు నాగార్జున తెలిపారు. చైతు కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని మాత్రమే ఈ వివాహ వేడుకకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. స్టూడియోలో వేసిన అందమైన సెట్‌లో చై, శోభిత ఒక్కటి కాబోతున్నట్టు తెలిపారు. పెళ్లి పనులు కూడా వారిద్దరే దగ్గరుండి చూసుకుంటున్నట్టు చెప్పారు. వీరి పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో వేదిక కావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదన్న నాగార్జున.. తమ కుటుంబ వారసత్వంలో ఒక భాగమని పేర్కొన్నారు.

అన్నపూర్ణ స్టూడియో తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావుకి ఎంతో ఇష్టమైన ప్రదేశం అని చెప్పారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్టు నాగార్జున వివరించారు. సంప్రదాయ తెలుగు పద్ధతిలో పెళ్లి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. శోభిత తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా పెళ్లి చయాలని తమను కోరారని అన్నారు. తనకు కూడా పెళ్లి మంత్రాలు వినడం ఎంతో ఇష్టమని.. అవి వింటుంటే తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని నాగార్జున అన్నారు.

హీరోయిన్ సమంతతో ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య.. కొన్నేళ్లపాటు సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చైతూతో శోభిత పరిచయం ప్రేమగా మారింది. పెద్దల సమక్షంలో డిసెంబర్ 4న ఒక్కటి కాబోతున్నారు. మరోవైపు శోభిత కూడా హీరోయిన్‌గా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story