Naga Chaitanya-Sobhita: శోభిత, చైతూ హనీ మూన్ పిక్స్ వైరల్.. మీరు కూడా చూసేయండి

Dhivi
Published on: 8 March 2025 10:37 AM IST
Naga Chaitanya-Sobhita: శోభిత, చైతూ హనీ మూన్ పిక్స్ వైరల్.. మీరు కూడా చూసేయండి
X

Naga Chaitanya-Sobhita: సమంత నుంచి విడాకులు తిసుకున్న తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత నుంచి చైతన్య తండేళ్ సినిమాతోనే బిజీగా ఉన్నారు. హనీమూన్ వెళ్దామనుకున్నా సమయం దొరకలేదు. ఇప్పుడు తండేల్ రిలజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇదంతా శోభితా వచ్చిన వేళా విశేషం అంటూ అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పుడు నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల మెక్సికోలో హనీమూన్ మోడ్ లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శోభితా తాజాగా తన హనీమూన్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. అమ్ స్టర్ డామ్, మెక్సికోలలో వీధుల్లో సరదగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను శోభిత షేర్ చేశారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి సాయంత్రం వరకు ఎలా గడపారో ఆమె షేర్ చేసిన ఫొటోలను చూస్తే తెలుస్తుంది. తండేల్ హిట్ హుషారుగా ఉన్న చైతన్య కూడా భార్యతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.



Dhivi

Dhivi

Next Story