Naga Chaitanya: కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన యువ హీరో.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Naga Chaitanya: కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన యువ హీరో

Dhatripriya
Updated on: 28 March 2023 9:31 PM IST
Naga Chaitanya Shifted To New House In Jubilee Hills
X

Naga Chaitanya: జూబ్లీహిల్స్ లో కొత్త ఇంటికి మారిపోయిన నాగచైతన్య

Naga Chaitanya: యువ హీరో అక్కినేని నాగచైతన్య ఈ మధ్యనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక ఖరీదైన బంగ్లాని కొనుక్కున్నారు. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య ఈ పాష్ ఇంటికి షిఫ్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 2017 లో సమంతని పెళ్లి చేసుకున్న నాగచైతన్య గచ్చిబౌలిలో ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ కి చెందిన ఒక లగ్జరీ పెంట్ హౌస్ కి షిఫ్ట్ అయ్యారు సమంతతో పాటు అక్కడ నాలుగేళ్లు ఉన్న నాగచైతన్య విడాకులకి కొద్ది నెలల ముందే అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.

కొన్ని రోజుల పాటు తన తండ్రి నాగార్జున ఇంట్లో ఉన్న నాగచైతన్య ఆ తరువాత ఒక స్టార్ హోటల్లో నివాసం ఉన్నారు. తన షూటింగ్ల పరంగా హైదరాబాద్ మరియు బాంబే తిరుగుతూ ఉన్న సమంత ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నారు. ఈ మధ్యనే నాగచైతన్య జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు తనకి బాగా నచ్చడంతో వెంటనే దానిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. మొన్నటి దాకా ఆ ఇంటి ఇంటీరియర్ వర్క్స్ ని దగ్గరుండి చూసుకున్నారు నాగ చైతన్య. ఇప్పుడు ఇల్లు రెడీ అయిపోవడంతో నాగచైతన్య కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది.

ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగచైతన్య "థాంక్యూ", "లాల్ సింగ్ చద్దా" సినిమాలతో పెద్దగా మెప్పించలేకపోయారు. తాజాగా ఇప్పుడు నాగచైతన్య "కస్టడీ" అనే తెలుగు తమిళ్ బై లింగువల్ సినిమా తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య కొత్త ఇంటి విలువ 15 కోట్లు.

Dhatripriya

Dhatripriya

Next Story