Naga Chaitanya: నాగేశ్వర రావు సినిమాని పక్కకు పెట్టిన నాగ చైతన్య

Naga Chaitanya: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం "థాంక్యూ" సినిమాతో బిజీగా ఉన్నారు.

admin1
Updated on: 19 Feb 2022 3:09 PM IST
Naga Chaitanya Set Aside Nageshwara Rao film
X

Naga Chaitanya: నాగేశ్వర రావు సినిమాని పక్కకు పెట్టిన నాగ చైతన్య 

Naga Chaitanya: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం "థాంక్యూ" సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక మరోవైపు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఒక సినిమా సైన్ చేశారు నాగ చైతన్య. ఈ సినిమాకి "నాగేశ్వరరావు" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య థాంక్యూ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కిషోర్ తిరుమల చెప్పారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ కిషోర్ తిరుమల తన తదుపరి ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం డీవీవీ తో ఒక సినిమా ఉందని అది ఒక రొమాంటిక్ కామెడీ అని చెప్పిన కిషోర్ తిరుమల ఆ సినిమాలో హీరోగా నాగచైతన్యని సంప్రదించినట్లు ప్రకటించారు. మరి ఈ సినిమా షూటింగ్ కనుక ముందుగా పట్టాలెక్కితే నాగేశ్వరరావు సినిమా వాయిదా వేయాల్సి వస్తుంది. లేక పరుశురాం డైరెక్షన్లో సినిమా పూర్తయ్యేదాకా కిషోర్ తిరుమల ఎదురు చూస్తారా అని ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న "థాంక్యూ" సినిమా కి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

admin1

admin1

Next Story