నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నాగ చైతన్య

Naga Chaitanya Sensational Comments on Nepotism
x

నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నాగ చైతన్య

Highlights

Naga Chaitanya: నాగ చైతన్య నెపోటిజం గురించి ఏమంటున్నారంటే..

Naga Chaitanya: ఇండస్ట్రీలో ఎన్ని హాట్ టాపిక్స్ పుట్టుకొస్తున్నప్పటికీ నెపోటిజం గురించి చర్చ మాత్రం జరుగుతూనే ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు నెపోటిజం గురించి పుకార్లు హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటాయి. తాజాగా తనదైన శైలిలో నెపోటిజం గురించి రియాక్ట్ అయ్యారు యువ హీరో నాగ చైతన్య. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెపోటిజం గురించి నాగచైతన్య ఇలా అన్నారు. "మా తాతగారు, నాన్నగారు ఇద్దరు నటులే కాబట్టి నేను నాకు కూడా సినిమాలంటే ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్లని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి యాక్టర్ అయ్యాను కానీ నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ఇప్పటికీ చాలా కష్టపడుతున్నాను," అని అన్నారు నాగచైతన్య.

ఒకవేళ తన తనతో పాటు మరొక సెల్ఫ్ మేడ్ హీరో సినిమా ఒకేసారి విడుదల అయ్యి తన సినిమా 10 కోట్లు, సెల్ఫ్ మేడ్ హీరో సినిమా 100 కోట్లు కలెక్షన్లు నమోదు చేస్తే నిర్మాతలందరూ సెల్ఫ్ మేడ్ హీరో వైపే వెళ్తారని, మార్కెట్ మరియు సక్సెస్ ని బట్టే డిమాండ్ ఉంటుందని చెప్పకొచ్చారు నాగచైతన్య. ఒక సెల్ఫ్ మేడ్ హీరో కొడుకు హీరో అవ్వాలి అనుకుంటే ఆ హీరో తన కొడుకుని ఆపేస్తాడా అని ప్రశ్నించిన నాగచైతన్య నెపోటిజం మీద తనకు నమ్మకం లేదని కొట్టిపారేశారు. ఇక మరోవైపు నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories