Naga Chaitanya: హీరోల పద్దతి మార్చుకోవాలి.. రెమ్యునరేషన్లపై నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు

హీరోలు లాభాల్లో షేర్ తీసుకోవాలి అంటున్న అక్కినేని యువ హీరో

Rama Rao
Updated on: 20 July 2022 5:30 PM IST
Naga Chaitanya Says that Heroes Should Take a Share in the Profits
X

Naga Chaitanya: హీరోల పద్దతి మార్చుకోవాలి.. రెమ్యునరేషన్లపై నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు

Naga Chaitanya: యువ హీరో నాగచైతన్య తాజాగా ఇప్పుడు "థాంక్యూ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా జూలై 22న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ మధ్యకాలంలో కంటెంట్ కింగ్ అని, కంటెంట్ బాగా ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని అన్నారు నాగచైతన్య. ప్రేక్షకులను థ్రిల్ చేసే ఎలిమెంట్లు సినిమాలో ఉంటేనే ఆ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అలాగే టెక్నికల్ విషయాలపరంగా కూడా సినిమాలలో కొన్ని మార్పులు రావాలని అన్నారు చై.

ఇక హీరోలు కూడా భారీ రెమ్యూనరేషన్లు తీసుకోకుండా సినిమాకు వచ్చిన లాభాల్లో షేర్ తీసుకోవడం ఉత్తమమని, అప్పుడే నిర్మాతలు బయటపడతారని అన్నారు. హీరోలు దర్శకులు మరియు నిర్మాతలు కలిసి బలమైన ప్లానింగ్ చేస్తేనే అది సాధ్యమని అన్నారు నాగ చైతన్య. ఇక తన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నలు అడగవద్దని ఖరాకండిగా చెప్పేసారు నాగ చైతన్య.

Rama Rao

Rama Rao

Next Story