Naga Chaitanya: వ్యక్తిగత ప్రశ్నలు వద్దు అంటున్న నాగచైతన్య

Naga Chaitanya: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండే యువ హీరోలలో నాగచైతన్య కూడా ఒకరు.

Arun Chilukuri
Updated on: 19 July 2022 8:31 PM IST
Naga Chaitanya Says no Personal Questions
X

Naga Chaitanya: వ్యక్తిగత ప్రశ్నలు వద్దు అంటున్న నాగచైతన్య

Naga Chaitanya: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండే యువ హీరోలలో నాగచైతన్య కూడా ఒకరు. ముఖ్యంగా సమంతతో విడాకుల విషయం గురించి పుకార్లు మొదలైనప్పటి నుంచి నాగచైతన్య తన వ్యక్తిగత విషయాలపై రియాక్ట్ అవ్వడం మానేశారు. ఇంటర్వ్యూలలో కూడా వ్యక్తిగత ప్రశ్నలు అడగవద్దని కరాకండిగా చెప్పేస్తున్నారు. గతంలో "లవ్ స్టోరీ" సినిమా విడుదల సమయంలో సమంతతో విడాకుల గురించి పుకార్లు వస్తున్నా కూడా నాగచైతన్య దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు.

ఆ తర్వాత వారిద్దరి విడాకులు ఖరారు అయ్యాక కూడా తన "బంగార్రాజు" సినిమా విడుదల సమయంలో నాగచైతన్య వ్యక్తిగత విషయాల గురించి మౌనం వహించారు. ప్రస్తుతం ఇప్పుడు తన తదుపరి సినిమా "థాంక్యూ" ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికే చాలా పుకార్లు వినిపిస్తున్నాయి.

నాగచైతన్య సమంత విడాకుల వెనుక కారణాలు ఏంటి, నాగచైతన్య ఇప్పుడు నటి శోభిత ధూళిపాలతో ప్రేమలో ఉన్నారా అంటూ బోలెడు వార్తలు టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. కానీ "థాంక్యూ" సినిమా ప్రమోషన్స్ లో సమయంలో కూడా తనను వ్యక్తిగత ప్రశ్నలు అడగవద్దని నాగచైతన్య చెబుతున్నారట. ఇలా ఎంత కాలం పాటు నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ ని చీకట్లో ఉంచుతారు అంటూ అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story