బ్యాచిలర్ పార్టీలో బట్టలు ఊడిపోతాయి అంటున్న నాగచైతన్య

* బ్యాచిలర్ పార్టీలో బట్టలు ఊడిపోతాయి అంటున్న నాగచైతన్య

Rama Rao
Updated on: 5 July 2022 7:00 PM IST
Naga Chaitanya Said Clothes Come Off in Bachelor Parties
X

బ్యాచిలర్ పార్టీలో బట్టలు ఊడిపోతాయి అంటున్న నాగచైతన్య 

Naga Chaitanya: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువహీరో నాగచైతన్య తాజాగా ఇప్పుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నటించిన "థాంక్యూ" సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జులై 22న థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు.

యాంకర్ కొన్ని ఇబ్బంది పెట్టే కొంటె ప్రశ్నలు అడుగుతూ ఉండగా రాశి ఖన్నా మరియు నాగచైతన్య డిప్లమాటిక్ గా జవాబులు ఇస్తూ వచ్చారు. కానీ ఒక ప్రశ్నకి మాత్రం నాగచైతన్య అందరూ షాక్ అయ్యేలా జవాబిచ్చారు. బ్యాచిలర్ పార్టీలో తాము చేసే మూడు పనులు ఏంటి అని యాంకర్ అడగగా రాశి ఖన్నా దానికి అందరిలాగానే డాన్స్, డ్రింక్, ఫన్ అంటూ చెప్పుకొచ్చింది.

కానీ నాగచైతన్య మాత్రం "బ్యాచిలర్ పార్టీలలో బట్టలు ఊడిపోతాయి, బాటిల్స్ ఖాళీ అయిపోతాయి, ఎవరు ఎవరిని నిద్రపోనివ్వరు" అంటూ షాకింగ్ జవాబు ఇచ్చారు. దీంతో నాగచైతన్య వెళ్లే బ్యాచిలర్ పార్టీలు ఇలా ఉంటాయా అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా", మరియు "దూత" వెబ్ సిరీస్ తో కూడా నాగ చైతన్య బిజీగా ఉన్నారు.

Rama Rao

Rama Rao

Next Story