Naga Chaitanya: విలన్ గా మారబోతున్న నాగచైతన్య

* అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న ఒక హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.

admin1
Published on: 14 Nov 2021 1:18 PM IST
Naga Chaitanya Plays a Villain Role in Amazon Prime Horror Web Series | Naga Chaitanya in Web Series
X

విలన్ గా మారబోతున్న నాగచైతన్య (ఫైల్ ఫోటో)

Naga Chaitanya in Horror Web Series: టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య మరియు సమంత ఈ మధ్యనే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరూ ఇకపై భార్యాభర్తలుగా ఉండలేము అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే విడాకులు తర్వాత నుంచి సమంత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది సామ్. ఇప్పుడు అదే బాటలో నాగచైతన్య కూడా కెరీర్ పైన దృష్టి సారించాడు. ఇంతకు మునుపెన్నడూ చేయనటువంటి విధంగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్నారు నాగ చైతన్య.

ఈ నేపథ్యంలోనే ఒక హారర్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగచైతన్య. ఓటీటీలో కూడా అడుగు పెట్టడానికి సిద్ధమయ్యారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న ఒక హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.

వెండి తెరపై హీరోగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నాగచైతన్య ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం విశేషం. ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక మరోవైపు నాగచైతన్య "థాంక్యూ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాగార్జున హీరోగా నటిస్తున్న "బంగార్రాజు" సినిమాలో నాగచైతన్య ఒక కీలక పాత్ర పోషించనున్నారు.

admin1

admin1

Next Story