Naga Chaitanya: నెగిటివ్ రోల్ లో కనిపించనున్న యువ హీరో

* అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్లో విడుదల కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు

admin1
Updated on: 23 Sept 2021 7:01 PM IST
Naga Chaitanya will be Appeared in Negative Role in Web Series
X

నాగచైతన్య (ఫోటో- ది హన్స్ ఇండియా) 

Naga Chaitanya: యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు తన తదుపరి సినిమా "లవ్ స్టోరీ" ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. రేపు అనగా సెప్టెంబర్ 24న విడుదల కాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టొరీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు నాగచైతన్య చేతిలో మంచి ఆఫర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య ఒక ప్రాజెక్టులో నెగిటివ్ రోల్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. "13బి", "24" సినిమాలకి దర్శకత్వం వహించిన విక్రమ్ కె కుమార్ "మనం" సినిమాకి కూడా దర్శకత్వం వహించారు.

ఇప్పుడు విక్రమ్ కుమార్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్లో విడుదల కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య మొట్టమొదటిసారిగా నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. హారర్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ తో నాగచైతన్య ఓటీటీలలో సైతం అడుగు పెట్టనున్నాడు.

admin1

admin1

Next Story