నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్‌.. నాగ చైతన్య ఎమోషనల్‌ పోస్ట్‌..

Naga Chaitanya Thank You Note: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో అక్కినేని నాగ చైతన్య...

Arun Chilukuri
Updated on: 7 July 2022 3:30 PM IST
Naga Chaitanya Pens An Emotional Thank You Note
X

నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్‌.. నాగ చైతన్య ఎమోషనల్‌ పోస్ట్‌..

Naga Chaitanya Thank You Note: ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా ఇప్పుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో "థాంక్యూ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ తోనే ఆకర్షించిన ఈ చిత్రం జులై 22న విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో నాగచైతన్య తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన జీవితంలోని ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పారు. అమ్మ నాన్న తో పాటు పెంపుడు కుక్కకి కృతజ్ఞతలు చెప్పారు నాగ చైతన్య. 2017లో సమంతను వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమెతో కలిసి హ్యాష్ అనే కుక్కపిల్లను దత్తత తీసుకున్నారు. అయితే వీరిద్దరి విడాకులు తర్వాత హ్యాష్ సమంత తోనే ఉంటోంది. తాజాగా ఈ పోస్ట్ ద్వారా హాష్ కు కృతజ్ఞతలు చెప్పారు నాగచైతన్య.

"అవసరమైన సందర్భంలో నేను ఎక్కువగా వాడే పదం థాంక్యూ. నా నెక్స్ట్ సినిమా థాంక్యూ రిలీజ్ సందర్భంగా నా జీవితంలో కీలక పాత్ర పోషించిన వారికి ఈ పోస్ట్ ని అంకితం చేస్తున్నాను. అమ్మ.. ఎప్పుడూ నా వెన్నంటే ఉంటూ అన్ని విధాలుగా నన్ను ప్రేమిస్తున్నందుకు థాంక్యూ. నాన్న.. ప్రతి విషయంలో నాకంటూ దారి చూపించి మంచి స్నేహితుడిలా ఉన్నందుకు థాంక్యూ. హ్యాష్.. ప్రేమించడం ఎలాగో తెలిసేలా చేసి నన్ను ఒక మనిషిగా ఉంచినందుకు థాంక్యూ," అని పోస్ట్ చేశారు నాగచైతన్య.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story