Naga Chaitanya - Priyanka Mohan: నాని బ్యూటీతో నాగ చైతన్య వెబ్ సిరీస్

*నాని హీరోయిన్ తో జత కట్టబోతున్న నాగ చైతన్య

admin1
Updated on: 21 Nov 2021 1:30 PM IST
Naga Chaitanya Pairs With Priyanka Mohan in Thank You Web Series
X

నాని బ్యూటీతో నాగ చైతన్య వెబ్ సిరీస్

Naga Chaitanya - Priyanka Mohan: టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య సమంత విడిపోయిన తరువాత ఇంతకుముందెన్నడూ చేయనటువంటి సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాగచైతన్య ఇప్పుడు ఓటీటీ లలో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య "మనం" ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో "థాంక్యూ" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాక నాగచైతన్య అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నాడట.

హారర్ థ్రిల్లర్ గా సూపర్ నాచురల్ సబ్జెక్టుతో 8 ఎపిసోడ్లు ఉండే ఈ వెబ్ సిరీస్ లో కనిపించనున్నాడు నాగ చైతన్య. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా నటించిన "గ్యాంగ్ లీడర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్ ఈ మధ్యనే తెలుగు డబ్బింగ్ సినిమా అయిన "వరుణ్ డాక్టర్" తో మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో కూడా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ప్రియాంక కి ఈ ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

admin1

admin1

Next Story