అఖిల్ హీరోయిన్ ని లైన్ లో పెట్టనున్న చైతు

Naga Chaitanya Next Movie Heroin Sakshi Vaidya | Tollywood News
x

అఖిల్ హీరోయిన్ ని లైన్ లో పెట్టనున్న చైతు

Highlights

*అఖిల్ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న నాగచైతన్య

Naga Chaitanya: ఇంతకుముందు ఒక మెగా హీరో నటించిన హీరోయిన్ తో మరొక మెగా హీరో రొమాన్స్ చేసే వాళ్ళు. కాజల్ అగర్వాల్, తమన్నా వంటి హీరోయిన్లు అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అక్కినేని బ్రదర్స్ కూడా హీరోయిన్లను మార్చుకుంటున్నారు. ప్రముఖ ముంబై బ్యూటీ సాక్షి వైద్య ఈమధ్య టీవీ యాడ్స్ లో కనిపిస్తూ పాపులర్ అయింది.

తాజాగా ఈమె అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న "ఏజెంట్" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. తాజాగా ఈమె నాగచైతన్యతో కూడా రొమాన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టు సమాచారం.యువ హీరో అక్కినేని నాగచైతన్య కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సాక్షిని హీరోయిన్గా ఎంపిక చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

ఒకవేళ సాక్షి కాకపోతే పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశాలు కల్పిస్తున్నట్లు సమాచారం. గతంలో నాగ చైతన్య సరసన "ఒక లైలా కోసం" సినిమాలో కనిపించిన పూజా హెగ్డే ఈ మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాలో అఖిల్ తో రొమాన్స్ చేసింది. అలాగే నాగ చైతన్య "సవ్యసాచి" సినిమా చేసిన నిధి అగర్వాల్ అఖిల్ తో "మిస్టర్ మజ్ను" సినిమా లో కనిపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories