Naga Chaitanya: నాగ చైతన్య నెక్స్ట్ సినిమా ఈ డైరెక్టర్ తోనా?

* "ఓహ్ బేబీ" డైరెక్టర్ తో నాగ చైతన్య

admin1
Updated on: 22 Oct 2021 1:46 PM IST
Naga Chaitanya New Movie with Director BV Nandini Reddy
X

నాగచైతన్య - నందిని రెడ్డి (ఫైల్ ఫోటో) 

Naga Chaitanya: "లవ్ స్టోరీ" సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అక్కినేని నాగ చైతన్య. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య "మనం" ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో "థాంక్యూ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. రాశి ఖన్నా మరియు అవికాగోర్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా కనిపించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య త్వరలోనే నందినిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారట.

"అలా మొదలైంది", "ఓ బేబీ" వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ నందిని రెడ్డి ఇప్పుడు మరొక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తో నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం సంతోష్ శోభన్, మరియు మాలవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న "అన్ని మంచి శకునములే" సినిమాతో బిజీగా ఉన్నా నందిని రెడ్డి ఈ సినిమా పూర్తయిన తర్వాత నాగచైతన్యతో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఇంతకుముందు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన "ఓ బేబీ" సినిమా లో నాగచైతన్య ఒక క్యామియో పాత్ర లో కనిపించారు.

admin1

admin1

Next Story