Naga Chaitanya: భిన్నమైన పాత్రతో బాలీవుడ్ లోకి ఎంట్రీ!

Naga Chaitanya New Look In Bollywood Movie
x

నాగ చైతన్య (ఫొటో ట్విట్టర్)

Highlights

Naga Chaitanya: యంగ్ హీరో నాగ చైతన్య తన రాబోయే సినిమాలను సైలెంట్‌గా పూర్తి చేసే పనిలో పడ్డాడు.

Naga Chaitanya: యంగ్ హీరో నాగ చైతన్య తన రాబోయే సినిమాలను సైలెంట్‌గా పూర్తి చేసే పనిలో పడ్డాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు చైతూ.

ఆ తరువాత దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో జోడి కట్టిన సంగతి తెలిసిందే. 'థాంక్ యూ' పేరుతో రానున్న ఈ సినిమాను దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చారు.

మరోవైపు, ఈ ప్రాజెక్ట్ తరువాత నాగ చైతన్య తన బాలీవుడ్ తొలి చిత్రం 'లాల్ సింగ్ చాధా' లో అమీర్ ఖాన్ తో స్రీన్ షేర్ చేసుకోనున్నాడు. చైతూ ఈ సినిమాలో భిన్నంగా‎ కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి నాగ చైతన్య 15 రోజుల కాల్‌షీట్లు ఇచ్చాడంట. చైతూ పార్ట్ ని ప్రస్తుతం లడఖ్‌లో షూట్ చేస్తున్నారని సమాచారం.

అమీర్ ఖాన్ ఇటీవల ఈ సినిమా కోసం కొన్ని అందమైన లొకేషన్లను గుర్తించాడంట. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగ చైతన్య తొలి సినిమాను చూసేందుకు అక్కినేని అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories