ఆసక్తికరమైన టైటిల్తో నాగచైతన్య సినిమా

*ఆసక్తికరమైన టైటిల్తో నాగచైతన్య సినిమా

Rama Rao
Updated on: 26 May 2022 9:30 AM IST
Naga Chaitanya Movie with the Title Nageswararao
X

ఆసక్తికరమైన టైటిల్తో నాగచైతన్య సినిమా

Naga Chaitanya Movie: దర్శకుడు పరశురామ్ ఈమధ్యనే మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కారు వారి పాట" సినిమా తో మర్చిపోలేని బ్లాక్బస్టర్ ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం అభిమానులు అందరూ పరసురామ్ తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పరశురాం ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య తో ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం పరశురామ్ ఈ సినిమాకి నాగేశ్వరరావు అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ "నాగేశ్వరరావు" కాబట్టి ఈ సినిమాలో కూడా నాగచైతన్య పేరు నాగేశ్వరరావు అయ్యుండొచ్చు అని సమాచారం.అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. గత కొంతకాలంగా పరశురాం నాగచైతన్యతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు కానీ ఈ సినిమా ఇప్పటికీ పట్టాలెక్కనుంది.

సినిమా ఒక యాక్షన్ డ్రామాగా విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరోవైపు నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న "థాంక్యు" సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.

Rama Rao

Rama Rao

Next Story