నాగచైతన్య ను చూసి షాక్ అయిన లక్ష్మి దగ్గుబాటి

Naga Chaitanya Mother Lakshmi Daggubati in Lal Singh Chaddha Shooting
x

నాగచైతన్య ను చూసి షాక్ అయిన లక్ష్మి దగ్గుబాటి

Highlights

Naga Chaitanya: వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న యువహీరో నాగచైతన్య..

Naga Chaitanya: వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న యువహీరో నాగచైతన్యకు ఈ మధ్యనే విడుదలైన "థాంక్యూ" సినిమాతో బ్రేకులు పడ్డాయి. అయితే మరోవైపు ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" సినిమాతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

అయితే తాజాగా ఈ చిత్ర ఆఖరి షూటింగ్ రోజున నాగచైతన్య తరపున ఒక స్పెషల్ గెస్ట్ కూడా షూటింగ్ సెట్స్ కి విచ్చేశారట. సినిమాలోని నాగచైతన్య మేకోవర్ చూసి ఆ గెస్ట్ షాక్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో కాదు నాగచైతన్య తల్లి లక్ష్మీ దగ్గుబాటి. షూటింగ్ ఆఖరి రోజున నాగచైతన్య బాలరాజు ముత్తాత పాత్రలో కూడా ఒక చిన్న సన్నివేశంలో నటించారు. పొడవాటి జుట్టు, మీసాలు ఉండే లుక్కుతో నాగచైతన్య సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.

ఈ అవతారంలో నాగచైతన్యను చూసి లక్ష్మీ దగ్గుబాటి షాక్ అయ్యారట. చిత్ర ఒరిజినల్ వెర్షన్ అయిన "ఫారెస్ట్ గంప్" లో ఇలాంటి సన్నివేశం లేదు కదా అని అడగగా నాగచైతన్య ఒరిజినల్ లో ఆ సన్నివేశం లేదని కానీ ఆమిర్ ఖాన్ మరియు డైరెక్టర్ అద్వైత్ కలిసి ఈ సన్నివేశాన్ని యాడ్ చేసినట్లుగా చెప్పారట. ఏదేమైనా అక్కినేని అభిమానులు అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories