Love Story Teaser: నాగ చైతన్య, సాయి పల్లవి 'లవ్ స్టోరీ' టీజర్ రిలీజ్

Love Story Movie Teaser
x

లవ్ స్టోరీ 

Highlights

అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్నతాజా చిత్రం 'లవ్ స్టోరీ'.

లవ్ స్టోరీ ఈ సినిమాకు చెందిన టీజర్ ఇవాళ విడుదల చేశారు. కేవలం ఒక్క నిమిషం నిడివితో వున్న టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ కూడా యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ టీజర్ విషయానికి వస్తే లైఫ్‌‌లో సెటిల్ కావడం కోసం ఇటు నాగ చైతన్య, అటు సాయి పల్లవి పడిన కష్టాలు.. ఇద్దరి మధ్య ప్రేమను కూడా శేఖర్ కమ్ముల తనదైన శైలిలో రూపొందించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

ఈ అందమైన ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలాన్ని పెంచేశారు. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం అన్ని అంశాల కలబోతగా ఈ లవ్ స్టోరీ రూపొందించారని టీజర్‌తో చెప్పేశారు. ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న మరో ప్రేమకథ 'లవ్ స్టోరీ'. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో సాయిపల్లవి చైతుతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంది. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories