Love Story Movie Records: మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన "లవ్ స్టోరీ"

Love Story Movie Records: ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫిబ్రవరి 2020 తర్వాత కేవలం రెండు సినిమాలు మాత్రమే ఈ ఘనతని సాధించాయి.
Love Story Movie Records: నాగ చైతన్య మరియు సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చిన సినిమా "లవ్ స్టోరీ". టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లో విడుదలైంది. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక అమెరికాలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా మిలియన్ డాలర్ల క్లబ్లో కూడా చేరిపోయింది. ఈ ఘనతను సాధించిన అతి కొన్ని తెలుగు సినిమాల్లో "లవ్ స్టోరీ" కూడా ఒకటిగా మారింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫిబ్రవరి 2020 తర్వాత ఇప్పటిదాకా కేవలం రెండు సినిమాలు మాత్రమే ఈ ఘనత ని సాధించాయి. మొదటిది నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన "జాతిరత్నాలు" సినిమా కాగా రెండవ స్థానాన్ని లవ్ స్టోరీ సాధించింది. విడుదలైన రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది. మరొక 60 వేల డాలర్లు వసూలు చేస్తే జాతి రత్నాలు రికార్డును కూడా లవ్ స్టొరీ బ్రేక్ చేయడానికి సిద్ధం గా ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా లవ్ స్టోరీ బాగానే కలెక్షన్లను నమోదు చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలలో లవ్ స్టోరీ కూడా ఒకటిగా మారింది.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMT