Naga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో

Naga Chaitanya: అక్కినేని యువ హీరో నాగచైతన్య ఇప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని సీక్రెట్‌గానే ఉంచాలని ప్రయత్నించారు.

Arun Chilukuri
Updated on: 28 Jun 2022 8:30 PM IST
Naga Chaitanya is Going to be Silent Even Longer
X

Naga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో

Naga Chaitanya: అక్కినేని యువ హీరో నాగచైతన్య ఇప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని సీక్రెట్‌గానే ఉంచాలని ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సమంతతో తన విడాకుల విషయం మరియు ఈ మధ్యనే నటి శోభిత ధూళిపాలతో ప్రేమ గురించిన పుకార్లపై చైతన్య ఎప్పుడు సైలెంట్ గానే ఉన్నాడు. ఇప్పటిదాకా ఎప్పుడు వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా బయటకు చెప్పని నాగచైతన్య ఇప్పుడు కూడా అలాగే ఉండబోతున్నారట.

తను హీరోగా నటించిన "లవ్ స్టోరీ" సినిమా ప్రమోషన్ సమయంలో సమంతతో తాను విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు వినిపించాయి కానీ నాగచైతన్య వాటికి రియాక్ట్ అవలేదు. ఆ తరువాత "బంగార్రాజు" సినిమా ప్రమోషన్ సమయంలో తన విడాకుల కి కారణం గురించి కూడా నాగ చైతన్య మాట్లాడలేదు. ఇక తాజాగా త్వరలో విడుదల కాబోతున్న "థాంక్యూ" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నాగచైతన్య ఇప్పుడు కూడా సమంత గురించి కానీ శోభితా ధూళిపాళ తో తన గురించి వస్తున్న వార్తలపై కానీ మాట్లాడటం లేదు.

ఇక త్వరలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్ద" లో నాగచైతన్య ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. త్వరలో బాలీవుడ్ లో జరగబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా నాగచైతన్య తన వ్యక్తిగత జీవితం గురించి అదే సైలెన్స్ మైంటైన్ చేస్తారని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story