Thank You Viral Video: మహేష్ బాబుకి సూపర్ ఫ్యాన్‌గా నాగ చైతన్య

Thank You Viral Video: టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమానిగా రాబోతున్న సినిమా 'థాంక్యూ'.

Venkata Chari
Published on: 9 March 2021 5:28 PM IST
Naga Chaitanya is a Super Fan of Prince Mahesh Babu
X

థాంక్యూ మూవీ సెట్ (ఫొటో ట్విట్టర్)

Thank You Viral Video: టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమానంట. ఏంటి నమ్మలేకపోతున్నారా... అయితే చదవండి మరి. నాగ చైతన్య రాబోయే సినిమా 'థాంక్యూ' లొ ప్రిన్స్‌కు సూపర్ ఫ్యాన్‌ గా నటించబోతున్నాడంట. విక్రమ్ కుమార్ డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమాను గతేడాది అక్టోబర్ లోనే అనౌన్స్ చేశారు. కోవిడ్ -19 తో కొంత విరామ తీసుకున్న టీం..తాజాగా మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసింది థాంక్యూ టీం.

తాజాగా రాజమండ్రిలోని అశోక థియేటర్ లో షూటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమాలో భాగంగా తన అభిమాన హీరో మహేశ్‌బాబు కటౌట్‌కు పూలమాల వేసి అభిషేకం చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నాగ చైతన్య టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. థియేటర్‌లో 'ఒక్కడు' మూవీ రిలీజ్ సందర్భంగా ప్రిన్స్ అభిమానిగా చైతు సందడి చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. కొందరు షూటింగ్ సన్నివేశాలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.

ఆ వైరల్ వీడియోలు, ఫొటోలు మీరూ చూడండి..



కాగా 'మనం' సినిమాతో అక్కినేని కుటుంబానికి భారీ విజయం అందించిన విక్రమ్ కె.కుమార్ 'థాంక్యూ' సినిమాలోనూ చైతన్యను సరికొత్తగా చూపబోతున్నట్లు థాంక్యూ టీం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story