Naga Chaitanya: ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అక్కినేని హీరో

Naga Chaitanya: ప్రస్తుతం నాగచైతన్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం "లవ్ స్టోరీ"

admin1
Published on: 6 Sept 2021 12:14 PM IST
Naga Chaitanya Going to do a Movie With Mohana Krishna Indraganti
X

నాగచైతన్య తో సినిమా చేయనున్న మోహన కృష్ణ ఇంద్రగంటి (ఫైల్ ఇమేజ్)

Naga Chaitanya: ప్రస్తుతం నాగచైతన్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం "లవ్ స్టోరీ". శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో "థాంక్యూ" సినిమాతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగార్జున నటిస్తున్న "బంగార్రాజు" సినిమా లో కనిపించనున్న నాగచైతన్య అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా "లాల్ సింగ్ చడ్డా" తో హిందీలో అడుగు పెట్టబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ మధ్యనే "వీ" సినిమాతో డిజాస్టర్ అందుకున్న విలక్షణ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఇప్పుడు నాగచైతన్య హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహు మరియు హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదివరకు నాగ చైతన్య ఈ పతాకంపై మజిలీ సినిమాలో నటించారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ ప్రొడక్షన్ హౌస్ తో నాగచైతన్య రెండవ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించనుందో చూడాలి.

admin1

admin1

Next Story