Naga Chaitanya: ఓటీటీ లలో అడుగు పెట్టనున్న నాగ చైతన్య

Naga Chaitanya: ఓటీటీ ప్రాజెక్ట్ కోసం లుక్ మార్చనున్న నాగ చైతన్య

admin1
Updated on: 19 Nov 2021 3:41 PM IST
Naga Chaitanya Going to be Act in Amazon Prime Horror Web Series
X

ఓటీటీ లలో అడుగు పెట్టనున్న నాగ చైతన్య (ఫైల్ ఇమేజ్)

Nagachaitanya: టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత మరియు నాగ చైతన్య విడిపోయిన తరువాత తమ తమ కెరీర్ ల పై దృష్టి పెట్టారు. ఇంతకుముందెన్నడూ చేయనటువంటి సరికొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ నేపథ్యంలోనే యువ హీరో నాగచైతన్య ఓటీటీ లలో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య "మనం" ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో "థాంక్యూ" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాగచైతన్య అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నాడట.

ఇది ఒక హారర్ థ్రిల్లర్ అని సూపర్ నాచురల్ సబ్జెక్టుతో కథ ఉండబోతోందని తెలుస్తోంది. 8 ఎపిసోడ్లు ఉండే ఈ వెబ్ సిరీస్ లో తమిళ్ బ్యూటీ ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సౌత్ నుండి పలు ప్రముఖ నటీనటులు కూడా ఈ ప్రాజెక్టులో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ ఎస్ కి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలు కాబోతోంది. నాగ చైతన్య ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర కోసం తన లుక్ కూడా మార్చబోతున్నారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

admin1

admin1

Next Story