నాగచైతన్య కారు ఆపేసిన హైదరాబాద్ పోలీసులు

*నాగచైతన్యకు 700 రూపాయల చలానా విధించిన హైదరాబాద్ పోలీసులు

Rama Rao
Updated on: 12 April 2022 10:00 PM IST
Naga Chaitanya fined By Hyderabad Traffic Police | Telugu Movie News
X

నాగచైతన్య కారు ఆపేసిన హైదరాబాద్ పోలీసులు

Naga Chaitanya Car: ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పోలీసులు ఒక స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్ లో భాగంగా కార్ల లకు బ్లాక్ కలర్ ఫిలిం వేసుకున్నవారి కారు లను ఆపి అవి తీసి పంపిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీల కార్లు కూడా వచ్చాయి. తాజాగా ఇప్పుడు అదే చలానా అక్కినేని యువ హీరో నాగచైతన్య కి కూడా వచ్చింది.

తన టయోటా వెల్ ఫైర్ ఎంపీవీ కారులో వెళ్తున్న నాగ చైతన్య కారు విండో లకు బ్లాక్ ఫిలిం వుండడంతో పోలీసులు ఆయనకు 715 రూపాయల చలానా విధించారు. డ్రైవ్ లను నిర్వహిస్తున్న పోలీసులు జరిపిన రొటీన్ చెక్ లో నాగచైతన్య కార్ ని నిలిపి వేసి చాలానాని ఇవ్వడం జరిగింది. ఈ ఘటన సోమవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద జరిగినట్లు తెలుస్తోంది.

కొద్దిరోజుల కిందటే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ రేంజ్ రోవర్ కార్ ను కుడా నిలిపివేసి చలానా విధించిన పోలీసులు కళ్యాణ్ రామ్ కారు కూడా నిలిపివేశారు. ఇక చలానా విధించిన వెంటనే నాగచైతన్యని భద్రంగా అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. నిజానికి రాష్ట్ర పోలీసులు ఇప్పటికే డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కొందరు సెలబ్రిటీలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన చాలానా ను విధించాల్సి వచ్చింది.

Rama Rao

Rama Rao

Next Story