Naga Chaitanya: కొత్త అపార్ట్మెంట్ లోకి మారిపోతున్న చైతూ.. సమంత ఉండబోతోంది అక్కడే..

Naga Chaitanya: సమంత మరియు నాగచైతన్య పెళ్లయిన వెంటనే గచ్చిబౌలి లో ఒక అపార్ట్ మెంట్ తీసుకుని అక్కడ కాపురం పెట్టిన సంగతి తెలిసిందే.

admin1
Updated on: 11 Oct 2021 9:30 PM IST
Naga Chaitanya Buys A New House
X

Naga Chaitanya: కొత్త అపార్ట్మెంట్ లోకి మారిపోతున్న చైతూ.. సమంత ఉండబోతోంది అక్కడే..

Naga Chaitanya: సమంత మరియు నాగచైతన్య పెళ్లయిన వెంటనే గచ్చిబౌలి లో ఒక అపార్ట్ మెంట్ తీసుకుని అక్కడ కాపురం పెట్టిన సంగతి తెలిసిందే. మొన్నటి దాకా వీరిద్దరూ అక్కడే ఉన్నారు. కానీ తాజాగా ఇప్పుడు నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇంట్లో కేవలం సమంతా మాత్రమే ఉంటుంది. నిజానికి గతేడాది వీరిద్దరూ కలిసి జూబ్లీహిల్స్లో ఒక బంగ్లాని కొనుక్కున్నారు. ఇంటీరియర్ వర్క్ మొత్తం కూడా పూర్తయ్యాక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నారు. కానీ ఇంతలోనే వారి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

ఇందులో మరమ్మతులు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ పనులు పూర్తి కావడానికి ఒక ఏడాది సమయం పట్టొచ్చు. అప్పటిదాకా నాగచైతన్య అక్కడికి వెళ్ళలేరు. అలా అని కుటుంబంతో కూడా కలిసి ఉండలేక ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్న నాగచైతన్య హైదరాబాదులో మరొక పోష్ ఏరియా లో ఒక పెద్ద అపార్ట్మెంట్ ని తీసుకున్నారు. కొన్ని రోజుల్లోనే నాగచైతన్య ఆ అపార్ట్మెంట్లో కి షిఫ్ట్ అవుతున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "లవ్ స్టోరీ" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది.

admin1

admin1

Next Story