నా జీవితంలో ఏం జరిగిందో వాళ్లకే తెలుసు.. సమంతతో విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగ చైతన్య!

నా జీవితంలో ఏం జరిగిందో వాళ్లకే తెలుసు.. సమంతతో విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగ చైతన్య!
x
Highlights

Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ జంట సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించి ఇప్పటికే చాలా కాలం అయింది.

Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ జంట సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించి ఇప్పటికే చాలా కాలం అయింది. అయినప్పటికీ వీరిద్దరూ విడిపోయారు అని చేదు నిజాన్ని ఇంకా అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి విడాకులకి గల కారణాల గురించి సోషల్ మీడియాలో బోలెడు పుకార్లు పుట్టుకొచ్చాయి.

తాజాగా ఈ పుకార్లపై రియాక్ట్ అవుతూ నాగచైతన్య జవాబు ఇచ్చారు. తన సినిమాల గురించి కంటే వ్యక్తిగత జీవితం గురించి వార్తలు ఎక్కువగా రావడం దురదృష్టకరమని అన్నారు నాగచైతన్య. "కరియర్ లో నేను సాధించిన విజయాల కంటే నా వ్యక్తిగత జీవితం ఎక్కువగా హెడ్లైన్స్ లో నిలవడం నిజంగా దురదృష్టం. మంచైనా చెడైనా నా జీవితం గురించి పంచుకోవాల్సిన విషయాలన్నీ చెబుతాను. విడిపోయినప్పుడు ఎవరి జీవితాల్లో వారు ముందుకు సాగిపోవాలనుకుంటున్నామని చెప్పాము. అంతకుమించి మా మధ్య జరిగిన ఒక్క విషయాన్ని కూడా నేను ప్రపంచానికి తెలియజేయాలి అనుకోవడం లేదు.

నా జీవితంలో అసలు ఏం జరిగిందో నా కుటుంబం మరియు బంధుమిత్రులకు తెలుసు. ఇక వార్తలను వార్తలు మాత్రమే రీప్లేస్ చేస్తాయి. ఈ ఊహగానాలు, పుకార్లు అన్నీ తాత్కాలికమైనవి. దీనిపై నేను ఎంత స్పందిస్తే అన్ని వార్తలు పుట్టుకొస్తాయి. అది నాకు ఇష్టం లేదు. అందుకే నేను వీటిని పట్టించుకోవడం లేదు. ఏదో ఒక రోజు ఈ పుకార్లకు ముగింపు పడుతుందని నమ్మకం నాకు ఉంది," అని చెప్పకొచ్చారు నాగచైతన్య.

Show Full Article
Print Article
Next Story
More Stories