Laal Singh Chaddha: ఆర్మీ లుక్‌లో చైతూ.. సోషల్ మీడియాలో వైరల్..

Laal Singh Chaddha: హీరో అక్కినేని నాగ చైతన్య త్వరలో బాలీవుడ్ చిత్రంలో కనిపించబోతున్నాడు.

Arun Chilukuri
Published on: 9 July 2021 5:00 PM IST
Naga Chaitanya Becomes Army Jawan For Laal Singh Chaddha Movie
X

నాగ చైతన్య(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Laal Singh Chaddha: హీరో అక్కినేని నాగ చైతన్య త్వరలో బాలీవుడ్ చిత్రంలో కనిపించబోతున్నాడు. హాలీవుడ్ చిత్రం "ఫారెస్ట్ గంప్" అనే చిత్రాన్ని బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గురువారం లడఖ్ లో జరుగుతున్న ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్న నాగ చైతన్య ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఆమీర్ ఖాన్ తో వెండి తెరని పంచుకోనున్నాడు.

ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన "లవ్ స్టోరీ" చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. గురువారం షూటింగ్‌లో పాల్గొనగా శుక్రవారం నాడు లాల్ సింగ్ చద్దా మూవీ యూనిట్ షూటింగ్ స్పాట్ నుంచి ఒక్క ఫొటో వదిలారు. ఆమీర్ ఖాన్, నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్లుగా కనిపించబోతున్నారు. సైనికుడి డ్రెస్‌లో ఆమీర్‌, నాగచైతన్య కనిపిస్తుండటం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సైనికుడి లుక్‌లో చైతూ ఆకట్టుకుంటున్నాడు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story